కరోనా.. పాక్‌పై ఔదార్యం.. మోదీ సంచలన నిర్ణయం..

| Edited By:

Feb 17, 2020 | 7:57 AM

Corona Virus Out Break: ఆపదలో ఉన్నది శత్రువు అయినా.. సాయం చేయాలన్న నీతిని భారత్ పాటిస్తోంది. కరోనా వైరస్‌తో సతమతమవుతున్న వూహాన్‌లో చిక్కుకుపోయిన పాకిస్తాన్ విద్యార్థులను ఆదుకునేందుకు మోదీ సర్కార్ ముందుకు వచ్చింది. పాక్ విద్యార్థులను ప్రత్యేక విమానంలో ఇస్లామాబాద్ తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ్యసభలో విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. చైనాలోని వూహాన్‌కు రెండు ఎయిర్ ఇండియా విమానాలను పంపామని.. అక్కడ ఉన్న భారతీయులతో పాటుగా పొరుగుదేశాలకు చెందిన వారిని కూడా తీసుకువస్తామని మంత్రి […]

కరోనా.. పాక్‌పై ఔదార్యం.. మోదీ సంచలన నిర్ణయం..
Follow us on

Corona Virus Out Break: ఆపదలో ఉన్నది శత్రువు అయినా.. సాయం చేయాలన్న నీతిని భారత్ పాటిస్తోంది. కరోనా వైరస్‌తో సతమతమవుతున్న వూహాన్‌లో చిక్కుకుపోయిన పాకిస్తాన్ విద్యార్థులను ఆదుకునేందుకు మోదీ సర్కార్ ముందుకు వచ్చింది. పాక్ విద్యార్థులను ప్రత్యేక విమానంలో ఇస్లామాబాద్ తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ్యసభలో విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. చైనాలోని వూహాన్‌కు రెండు ఎయిర్ ఇండియా విమానాలను పంపామని.. అక్కడ ఉన్న భారతీయులతో పాటుగా పొరుగుదేశాలకు చెందిన వారిని కూడా తీసుకువస్తామని మంత్రి అన్నారు. రాజ్య సభ్యురాలు రూపా గంగూలీ అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు.

ఇటీవల భారత్ వూహాన్‌ నగరం నుంచి సుమారు 638 భారతీయులను.. ఏడుగురు మాల్దీవ్స్‌కు చెందిన వారిని వెనక్కి తీసుకొచ్చింది. అటు సుడాన్, ఇండోనేషియా ప్రభుత్వాలు కూడా తమ జాతీయులను తరలించాయి. అయితే పాకిస్థాన్ మాత్రం కరోనా వైరస్ లాంటి మహమ్మారిని ఎదుర్కునే శక్తి తమకు లేదని.. పాక్ విద్యార్థులంతా అక్కడే ఉండిపోవాలని చేతులెత్తేసింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ సర్కార్‌పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

వూహాన్ నగరంలో ఇంకా 80 మంది భారతీయులు ఉన్నారని మంత్రి జైశంకర్ తెలిపారు. అందులో 10 మందికి కరోనా లక్షణాలు ఉండటంతో చైనా అధికారులు.. వారిని అక్కడే ఉంచేశారని చెప్పారు. అయితే అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ మాత్రం ఎప్పటికప్పుడు వారితో సంప్రదింపులు జరుపుతోందని ఆయన వెల్లడించారు. వైద్యుల పరిరక్షణలోనే ఆ 80 మంది భారతీయులు ఉన్నారని.. ఎంబసీ అన్ని విషయాలను పర్యవేక్షిస్తోందని రాజ్యసభ సాక్షిగా వారి కుటుంబాలకు మంత్రి హామీ ఇచ్చారు.