కరోనా వైరస్.. ‘బయాలజికల్ గూఢచర్యం’లో భాగమా ?
చైనాలో మొదలై ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్‌పై సరికొత్త కథనాలు వినవస్తున్నాయి. ఇది అసలు ‘ లీక్ అయిన బయలాజికల్ వెపన్’ అయిఉండవచ్ఛునని భావిస్తున్నారు. చైనాలోని వూహాన్ లో గల వైరాలజీ ఇన్స్‌టిట్యూట్ అత్యంత అధునాతనమైన రీసెర్చ్ ల్యాబ్.. రహస్యంగా చైనా నిర్వహించే బయాలజికల్ వార్ ప్రోగ్రామ్‌కి ఇది ఓ ప్రధాన కేంద్రం వంటిదని ‘వాషింగ్టన్ టైమ్స్’ సైతం పేర్కొంది. తనను ఇజ్రాయెల్ కి చెందిన మాజీ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారినని చెప్పుకుంటున్న డేనీ షోహమ్ […]

చైనాలో మొదలై ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్‌పై సరికొత్త కథనాలు వినవస్తున్నాయి. ఇది అసలు ‘ లీక్ అయిన బయలాజికల్ వెపన్’ అయిఉండవచ్ఛునని భావిస్తున్నారు. చైనాలోని వూహాన్ లో గల వైరాలజీ ఇన్స్‌టిట్యూట్ అత్యంత అధునాతనమైన రీసెర్చ్ ల్యాబ్.. రహస్యంగా చైనా నిర్వహించే బయాలజికల్ వార్ ప్రోగ్రామ్‌కి ఇది ఓ ప్రధాన కేంద్రం వంటిదని ‘వాషింగ్టన్ టైమ్స్’ సైతం పేర్కొంది. తనను ఇజ్రాయెల్ కి చెందిన మాజీ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారినని చెప్పుకుంటున్న డేనీ షోహమ్ అనే వ్యక్తి ఈ వైరాలజీ సంస్థ తన బయాలజికల్ వార్ ఫేర్ ప్రోగ్రాంతో తమ దేశ మిలిటరీ వ్యవస్థకు సహకరిస్తూ ఉండవచ్ఛునని విశ్లేషించారు. చైనా బయో వార్ ఫేర్ ప్రోగ్రాంకి, ఈ వైరస్‌కి లింక్ ఉందన్నది ఆయన అభిప్రాయంగా కనబడుతోంది. తను ఈ ప్రోగ్రామ్‌ని నిశితంగా అధ్యయనం చేశానని ప్రకటించుకున్న ఆయన.. ఈ వైరస్ ప్రబలడానికి ఈ ల్యాబే ప్రధాన కారణమై ఉండవచ్ఛునని కూడా పేర్కొన్నారు. ఎబోలా, నిఫా, సార్స్ వంటి అత్యంత ప్రమాదకర వైరస్‌లపై పరిశోధనలు చేయగల ఈ సంస్థ.. వూహాన్ లోని ‘హునాన్ సీ ఫుడ్ మార్కెట్ ‘ కి కేవలం 32 కిలో మీటర్ల దూరంలో ఉంది.

ఈ మార్కెట్లో చేపలతో బాటు ఇతర జలచరాలు, నక్కలు, పాములు, ఇతర క్రూర జంతువుల శరీర భాగాలను విక్రయిస్తుంటారు. వీటిని కొన్ని దేశాలకు (అక్రమ) రవాణా కూడా చేస్తుంటారు. కుళ్లిపోయిన ఈ జంతువుల శరీర భాగాలు, చేపలు, ఇతర జలచరాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందన్నది ఒక ప్రచారమైతే.. మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటపడింది. ‘గ్రేట్ గేమ్ ఇండియా’ అనే ఆన్ లైన్ పోర్టల్ నిర్వహించిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం.. ఈ వైరస్ కెనడాలోని ఇద్దరు చెనీస్ బయాలజికల్ వార్ ఫేర్ ఏజంట్లు దీన్ని తమ దేశంలోకి ‘స్మగుల్’ చేసినట్టు తేలింది.. గత ఏడాది మార్చి నెలలో కెనడా నుంచి వచ్చిన ఓ నౌకలో ప్రమాదకరమైన (డెడ్లీ) వైరస్ చైనాకు చేరింది. కెనడా ఎందుకిలా చేసిందో, ఆ ఏజెంట్ల ఉద్దేశమేమిటో తెలియక చైనా శాస్త్రజ్ఞులు తర్జనభర్జన పడ్డారు. కెనడాకు చెందిన ‘కెనడియన్ నేషనల్ మైక్రో బయాలజీ లేబొరేటరీ’ లో పని చేసే తమ దేశ ఏజంట్ల పనే ఇధై ఉండవచ్చునని వారు అభిప్రాయపడ్డారు.

ఈ వైరస్ ను కావాలనే స్మగుల్ చేశారా లేక కాకతాళీయంగా జరిగిందా అన్నదాన్ని వారు నిర్ధారించుకోలేకపోయారు. ఒకవేళ కావాలనే వ్యాప్తి చెందింపజేశారనడానికి ఆధారాలు లేకపోయినా.. యుఎస్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ లోని బయో వార్ ఫేర్ సీనియర్ ఫెలో, న్యూరాలజీ ప్రొఫెసర్ జేమ్స్ జియోర్డినో మాత్రం చైనాలో బయో సైన్స్ లో పెట్టుబడులు పెరగడం కొన్ని దేశాలకు ఈర్ష్య కలిగించిందని అభిప్రాయపడ్డారు.

అంటే బహుశా ఇది బయాలాజికల్ గూఢచర్యంలో భాగమై ఉండవచ్ఛునని ఆయన అభిప్రాయపడినట్టు కనిపిస్తోందని ఈ పోర్టల్ ఇన్వెస్టిగేషన్ పేర్కొంది. నిజానికి ఎబోలా, సార్స్ , కరోనా వైరస్ వంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధి లక్షణాలను అదుపు చేయగల సాధనాలు నార్త్ అమెరికాలోను, మరికొన్ని దేశాల్లో మాత్రమే ఉన్నాయి. అయినా ఆ దేశాలు మౌనం వహిస్తున్నాయి. అలాగే చైనా ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఈ వైరస్ వ్యాప్తికి మూలంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అంటే మానవ అవయవాలపై, ముఖ్యంగా జన్యువులపై చూపగల వైరస్ ప్రభావం మీద ఈ దేశం చడీ చప్పుడు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ వ్యాధి బారిన పడి మృతి చెందినవారి సంఖ్య 100 కు పైగా పెరగగా, సుమారు మూడు వేల మందికి పైగా వైరస్ ప్రభావంతో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వూహాన్ సిటీలోని ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోగా.. చైనాలోని మరిన్ని రాష్ట్రాల్లో అలర్ట్ ప్రకటించారు.
