
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 2,995 కొత్త కేసులు నమోదు కాగా..యాక్టివ్ కేసుల సంఖ్య 16 వేలు దాటింది. అయితే నిన్నటితో పోలిస్తే కేసులు కొద్దిగా తగ్గినప్పటికీ రాబోయే రోజుల్లో కేసులు ఎక్కువగా పెరగచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు. కరోనా కేసుల పెరుగుదలపై హర్యాణాకి చెందిన మేదాంత హాస్పిటల్ చెస్ట్ సర్జరీ ఇనిస్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ అరవింద్ కుమార్ స్పందించారు. రాబోయే రోజుల్లో కరోనా కేసులు గణనీయంగా పెరగొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ప్రతిఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఉన్నట్లు ఆక్సిజన్ కొరత రావడం.. ఎక్కవగా మరణాలు జరగడం లాంటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. వ్యాక్సినేషన్ ప్రభావం వల్లే ఇదంత సాధ్యమైనట్లు పేర్కొన్నారు.
కరోనా కేసులు ఈమధ్య పెరుగుతున్న నేపథ్యంలో జనాలు జాగ్రత్తలు పాటించకరపోవడం వల్ల వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉందని.. దీనివల్ల కేసులు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కొంతమంది ఇబ్బందులు పడొచ్చని తెలిపారు. చిన్న పిల్లలు, దీర్ఝకాలిక సమస్యతో బాధపడున్నవారు, వృద్ధులపై ఈ వైరస్ ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వైరస్ వేరియంట్ లో కొత్త కొత్త మార్పులు జరుగుతున్నందున జాగత్తగా ఉండాలని సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..