Corona Cases In India: దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఆందోళన కలగజేస్తోంది. గతంతో పోలిస్తే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండటం కలవరానికి గురి చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 47,262 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,17,34,058కి చేరింది. ఇందులో 3,68,457 యాక్టివ్ కేసులు ఉండగా, 1,12,05,160 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న 275 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,60,441కి చేరుకుంది. నిన్న కొత్తగా 23,907 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
కాగా, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో మునపటి కంటే భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజులో 28,699 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేరళలో 1985 కొత్త కేసులు బయటపడగా, కర్ణాటకలో 2010 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.
కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర హోంశాఖ కొత్త నిబంధనలను విడుదల చేసింది. కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని… ఏప్రిల్ 30 వరకు కొనసాగుతాయని పేర్కొంది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ ప్రోటోకాల్ పాటించాలని కేంద్రం.. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను సూచించింది. కరోనా వ్యాప్తి మరోసారి ఉధృతం అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్‌గా ఉండాలని.. సూచించింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన కోవిడ్-19 నిబంధనలు, మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు విడుదల చేసింది.
అన్ని రాష్ట్రాలు ఆర్టీపీసీఆర్ పరీక్షల టెస్టుల సంఖ్యను 70 శాతానికి పెంచాలని.. పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో కరోనా మార్గదర్శకాలు, నిబంధనలు అమలయ్యేలా అధికార యంత్రాంగం పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రజల రద్దీ అధికంగా ఉండే ఏరియాలలో ప్రాంతాలలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు తీసుకోవాలని.. అయితే అంతరాష్ట్ర రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని స్పష్టంగా పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను అన్ని రాష్ట్రాలు మరింత వేగవంతం చేయాలని పేర్కొంది. అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సినేషన్ లభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!
జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!
బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…