Maharashtra Corona: దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రెండేళ్లుగా వ్యాప్తి చెందుతున్న కరోనా.. తగ్గుముఖం పట్టినట్లే పట్టి థర్డ్‌వేవ్ రూపంలో దేశంపై పంజా విసురుతోంది. గతంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్, ఇతర కఠినమైన చర్యలతో కాస్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఒక వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో భయాందోళనకు గురి చేస్తుంటే తగ్గిందనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇక మొదటి నుంచి కరోనా కేసుల్లో మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్ర.. ఇప్పుడు కూడా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అటు ఒమిక్రాన్, ఇటు కరోనా కేసులతో మహారాష్ట్ర సతమతమవుతోంది. ఇక తాజాగా36,265 మంది కోవిడ్ బారిన పడ్డారు. అదే పశ్చిమ బెంగాల్-15,421, ఢిల్లీ-15,097, కర్ణాటక-5,031, కేరళ-4,649, గుజరాత్-4,213 పాజిటివ్ కేసులు కేసులు వెలుగులోకి వచ్చాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలు సంపూర్ణ లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
లాక్‌డౌన్ దిశగా మహారాష్ట్ర:
ఇక మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండటంతో సంపూర్ణ లాక్‌డౌన్ విధించే దిశగా ఆలోచిస్తోంది మహారాష్ట్ర. ముంబైలో 20వేలకుపైగా కేసులు నమోదు అవుతుండగా, సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తామంటూ ఇది వరకే మేయర్ కిశోరీ పెడ్నేకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సంఖ్య దాటిపోయింది. అనేక ప్రాంతాలను ఇప్పటికే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సంపూర్ణ లాక్‌డౌన్ విధించే దిశగా ఆలోచనలు చేస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా కేసులపై ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె.. అధికారులతో వరుస సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలుపై అధికారులతో చర్చించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చని, దీనిపై మరింత సమాచారాన్ని సేకరించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అలాగే కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని ప్రాథమికంగా చర్చించామని స్పష్టం చేశారు. ఇలాగే కేసుల సంఖ్య మరింతగా పెరిగే లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి: