Jammu And Kashmir: ఉగ్రవాదుల దుశ్చర్య.. పోలీసు అధికారిపై గ్రనేడ్‌తో దాడి.. తీవ్ర గాయాలతో..

|

Aug 14, 2022 | 8:57 AM

నివారం రాత్రి కుల్గాం జిల్లాలోని ఖైమోహ్‌ ప్రాంతంలో ఓ పోలీసు అధికారిపై ఉగ్రవాదులు గ్రనేడ్‌తో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను అనంత్‌నాగ్‌లోని

Jammu And Kashmir: ఉగ్రవాదుల దుశ్చర్య.. పోలీసు అధికారిపై గ్రనేడ్‌తో దాడి.. తీవ్ర గాయాలతో..
Jammu And Kashmir
Follow us on

Cop Killed In Grenade Attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. రాజౌరీలోని ఆర్మీ శిబిరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడిన రెండు రోజుల తర్వాత.. ఉగ్రవాదులు మరోసారి దారుణానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి కుల్గాం జిల్లాలోని ఖైమోహ్‌ ప్రాంతంలో ఓ పోలీసు అధికారిపై ఉగ్రవాదులు గ్రనేడ్‌తో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మృతి చెందిన అధికారి పూంచ్‌కు చెందిన తాహిర్‌ ఖాన్‌గా గుర్తించారు. ఈ మేరకు కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడిలో తాహిర్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడని.. అతన్ని జీఎంసీ ఆసుపత్రికి తరలించామని.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, రాజౌరీ జిల్లాలోని ఆర్మీ క్యాంప్‌పై ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన రెండో రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గురువారం ఉదయం రాజౌరీలోని ఆర్మీ బేస్‌ క్యాంపుపై ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన కాల్పుల్లో నలుగురు సైనికులు వీరమరణం పొందగా.. ఇద్దరు టెర్రిరిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి.

ఇదిలాఉంటే.. శుక్రవారం ఉగ్రవాదులు బండిపొర జిల్లాలోని సొద్‌నార సంబాల్‌ ప్రాంతంలో ఓ వలస కార్మికుడిని కాల్చిచంపారు. బందిపూర్ జిల్లాలోని అజాస్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి వలస కార్మికుడిని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. కాగా.. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్స వేడుకలకు ముందు వరుస ఉగ్రవాద ఘటనలతో జమ్మూకాశ్మీర్లో భయాందోళన నెలకొంది. ఇదిలాఉంటే.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో బలగాలు సైతం అప్రమత్తమయ్యాయి. అనుమానిత ప్రాంతాల్లో భారీగా తనిఖీలు చేపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం