AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేతలంటే.. ఆర్మీ చీఫ్ నోట .. బీజేపీ ‘ మాట ‘!

సవరించిన పౌరసత్వ చట్టంపై దేశంలో జరుగుతున్న హింస, అల్లర్లను ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఖండించారు. వీటిని ప్రేరేపించేవారు నేతలు కారని, లీడర్ అంటే ముందుండి నడిపించేవాడు కానీ హింసాత్మక ఘర్షణలను రెచ్చగొట్టేవాడు కాదని ఆయన అన్నారు. నాయకుడు ముందు ఉండి నడిస్తే.. వెనుక జనం నడుస్తారు.. సరైన మార్గంలో వారిని నడిపించేవారే నిజమైన నాయకులు అన్నారాయన.. దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీ విద్యార్థులు అల్లర్లకు, హింసకు పాల్పడుతున్నారని, వారిని ప్రోత్సహించేవారు నాయకులెలా అవుతారని ఆయన ప్రశ్నించారు. […]

నేతలంటే.. ఆర్మీ చీఫ్ నోట .. బీజేపీ ' మాట '!
Anil kumar poka
|

Updated on: Dec 26, 2019 | 4:07 PM

Share

సవరించిన పౌరసత్వ చట్టంపై దేశంలో జరుగుతున్న హింస, అల్లర్లను ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఖండించారు. వీటిని ప్రేరేపించేవారు నేతలు కారని, లీడర్ అంటే ముందుండి నడిపించేవాడు కానీ హింసాత్మక ఘర్షణలను రెచ్చగొట్టేవాడు కాదని ఆయన అన్నారు. నాయకుడు ముందు ఉండి నడిస్తే.. వెనుక జనం నడుస్తారు.. సరైన మార్గంలో వారిని నడిపించేవారే నిజమైన నాయకులు అన్నారాయన.. దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీ విద్యార్థులు అల్లర్లకు, హింసకు పాల్పడుతున్నారని, వారిని ప్రోత్సహించేవారు నాయకులెలా అవుతారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మొదటిసారిగా సీఏఏకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై ఇలా స్పందించారు. ఈ నెల 31 న బిపిన్ రావత్ రిటైర్ కానున్నారు. అయితే ఆయన ప్రసంగం రాజకీయంగా ఉందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యానికి విరుధ్దమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాజకీయ సమస్యలపై ఒక సైనికాధికారిని మాట్లాడేందుకు అనుమతిస్తే.. సైన్యాన్ని హస్తగతం చేసుకునేందుకు కూడా అనుమతిస్తారా అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బ్రిజేష్ కాలప్ప ట్వీట్ చేశారు. అయితే కొంతమంది మాత్రం బిపిన్ వ్యాఖ్యలను సమర్థించారు. ఈ దేశ పౌరునిగా మాట్లాడే హక్కు ఆయనకు ఉందన్నారు.

Follow Us
NTAలో ఉద్యోగం కావాలా? UPSC ప్రతిభా సేతు నోటిఫికేషన్‌ విడుదల..
NTAలో ఉద్యోగం కావాలా? UPSC ప్రతిభా సేతు నోటిఫికేషన్‌ విడుదల..
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్‌ షాక్
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్‌ షాక్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!
కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?
కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?
వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
ప్రకృతి వ్యవసాయం - ఎంతో లాభదాయకం - మరెంతో ఆరోగ్యకరం
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎక్కడంటే?
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
ఏం కొనేటట్టులేదు.. రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల ధరలు చూశారా
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం..
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం
సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో రూ.50కే కేజీ బియ్యం