Firing: అమృత్‌సర్ లో దారుణం.. సహచరులపై జవాన్ కాల్పులు.. ఆపై ఆత్మహత్య..

పంజాబ్‌లోని అమృత్‌సర్ బీఎస్ఎఫ్ క్యాంప్‌లో దారుణం జరిగింది. తోటి సిబ్బందిపై ఓ బీఎస్ఎఫ్ జవాన్ కాల్పులు జరిపాడు.

Firing: అమృత్‌సర్ లో దారుణం.. సహచరులపై జవాన్ కాల్పులు.. ఆపై ఆత్మహత్య..
Bsf

Edited By: Basha Shek

Updated on: Mar 06, 2022 | 2:57 PM

పంజాబ్‌లోని అమృత్‌సర్ బీఎస్ఎఫ్ క్యాంప్‌లో దారుణం జరిగింది. తోటి సిబ్బందిపై ఓ బీఎస్ఎఫ్ జవాన్ కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. 10 మందికి గాయాలు అయ్యాయి. క్యాంపులోని మెస్‌లో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అతను కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. గాయపడిన వారిలో ఒక జవాన్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం నలుగురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతదేహాలు ఆస్పత్రికి తరలించారు.

అమృత్‌సర్‌లోని హెచ్‌క్యూ 144 Bn ఖాసాలో కానిస్టేబుల్ సత్తెప్ప జరిగిన కాల్పల్లో నలుగురు చినిపోయినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. అతనితో కలిపి మొత్తం 5గురు మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో సత్తెప్ప కూడా మరిణించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, గాయపడిన వారందరినీ గురునానక్ దేవ్ ఆసుపత్రిలో చేర్చారు.

Read Also.. India Covid-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది చనిపోయారంటే..?