ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోండి.. కేంద్ర హోంశాఖకు సుకేశ్ చంద్రశేఖర్ లేఖ..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరారు సుకేశ్ చంద్రశేఖర్. ఈ మేరకు హోంశాఖకు లేఖ రాశారు. కవిత, సత్యేందర్ జైన్, అరవింద్ కేజ్రీవాల్ మధ్య జరిపిన వాట్సాప్ చాట్స్‌ను హోంశాఖకు పంపారు. డబ్బుని నెయ్యిగా కోడ్ నేమ్‌తో పిలుస్తూ కవితతో చాటింగ్ చేశారని అన్నారు సుకేశ్.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరారు సుకేశ్ చంద్రశేఖర్. ఈ మేరకు హోంశాఖకు లేఖ రాశారు. కవిత, సత్యేందర్ జైన్, అరవింద్ కేజ్రీవాల్ మధ్య జరిపిన వాట్సాప్ చాట్స్‌ను హోంశాఖకు పంపారు. డబ్బుని నెయ్యిగా కోడ్ నేమ్‌తో పిలుస్తూ కవితతో చాటింగ్ చేశారని అన్నారు సుకేశ్. కవిత సూచనల మేరకు తన వ్యక్తులు హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి డబ్బును సేకరించారని లేఖలో ప్రస్తావించారు.
ప్రస్తుతం కవిత కస్టడీలో ఉండటంతో.. కేసు విచారణలో ఈ చాట్స్ ఉపయోగపడతాయని సుకేశ్ తెలిపారు. తన వాట్సాప్ చాట్‌లను ఫారమ్ 65Bతో పాటు చట్టానికి అనుగుణంగా విచారణ చేపట్టాలని కోరారు. డబ్బుకు నెయ్యిగా కోడ్ నేమ్ లో సంప్రదింపులు జరిపారంటూ హోంశాఖకు వాట్సాప్ చాట్స్ ను సుకేశ్ పంపించాడు.. అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, కైలాష్ గెహ్లోత్, కవిత నేతృత్వంలోని ఆప్ సిండికేట్‌కు సంబంధించి తన దగ్గర ఉన్న సాక్ష్యాలతో కేసు దర్యాప్తునకు సహకరిస్తానని తెలిపారు.
తప్పుడు కేసులో తనను జైలులో పెట్టారన్న సంజయ్ సింగ్
మరోవైపు లిక్కర్ కేసుపై ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి శరత్‌చంద్ర ఇచ్చిన విరాళాలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. శరత్‌చంద్రారెడ్డి నుంచి రూ.60 కోట్లు తీసుకుని.. BJP క్విడ్ ప్రోక్రోకు పాల్పడిందన్నారు. బీజేపీ నేతలను అరెస్ట్ చేయాల్సిందిపోయి..కేజ్రీవాల్, సిసోడియాను అరెస్ట్ చేశారని సంజయ్‌సింగ్ అన్నారు. తప్పుడు కేసులో తనను కూడా జైల్లో పెట్టారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ, ఈడీ కేసుల్లో మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టు.. ఏప్రిల్ 30న తీర్పు ఇవ్వనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..