Congress Meeting Today Updates: ముగిసిన కాంగ్రెస్ మేధోమథనం.. ఇలా చర్చ జరిగింది..

| Edited By: Sanjay Kasula

Mar 14, 2022 | 11:46 AM

CWC Meeting Today: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు సీడబ్లూసీ సమావేశం జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వాడి వేడి చర్చ జరిగింది.

Congress Meeting Today Updates: ముగిసిన కాంగ్రెస్ మేధోమథనం.. ఇలా చర్చ జరిగింది..
Cwc Meeting

Congress Working Committee Meeting: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు సీడబ్లూసీ సమావేశం జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వాడి వేడి చర్చ జరిగింది. అధిష్టానానికి సవాళ్లు విసురుతున్న జీ-23 అసంతృప్తి నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. రాహుల్‌గాంధీతో పాటు పలువురు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై చర్చించారు. ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు, ఇన్చార్జిలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్లు, జీ-23 అసమ్మతి గ్రూపు నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఈ భేటీకి హాజరయ్యారు. కాగా, కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయాలని జీ-23 అసమ్మతి నేతలు సోనియా గాంధీకి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

అయితే ముకుల్‌ వాస్నిక్‌ను కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ను చేయాలని జీ23 నేతలు తెరపైకి తెచ్చారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని నిరాశపర్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ఫలితాలు రాగానే అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కూడా చేజార్చుకుంది. దీంతో అంతర్మథనంలో పడింది కాంగ్రెస్. రేపటి నుంచి ప్రారంభం అయ్యే పార్లమెంట్ రెండో విడత సమావేశాలు, కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి గల కారణాలు.. పార్టీ సంస్థాగత ఎన్నికలు.. పార్టీలో అంతర్గతంగా విస్తరిస్తున్న అసంతృప్తిపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే, అంతకు ముందుగానే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రాప్ సమావేశం అయింది.

రేపటి నుంచి ప్రారంభం అయ్యే పార్లమెంట్ రెండో విడత సమావేశాల కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. అధికార బీజేపీ పార్టీని ఎలా ఎదర్కోవాలనే దానిపై చర్చించనున్నారు. ఇందు కోసం సోనియా గాంధీ నివాసం 10 జన్‌పథ్‌లో ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రాప్ సమావేశం అయింది. కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశానికి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, ఆనంద్ శర్మ, కె సురేష్, జైరాం రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలపై పోస్టుమార్టం నిర్వహించిన్నట్లు తెలుస్తోంది.

నిజానికి యూపీలో మొత్తం 403 స్థానాలకు ఓటింగ్ జరగగా, ఇక్కడ కాంగ్రెస్‌కు కేవలం 2 సీట్లు మాత్రమే దక్కాయి. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని 70 సీట్లలో కాంగ్రెస్‌కు 19 సీట్లు మాత్రమే వచ్చాయి. పంజాబ్‌లో మొత్తం సీట్లు 117, కాంగ్రెస్‌కు 18, గోవాకు 40, కాంగ్రెస్‌కు 11. మణిపూర్‌లో 60 సీట్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు 5 సీట్లు మాత్రమే వచ్చాయి.

రాజ్యసభలో ప్రతిపక్ష హోదా కోల్పోయే పరిస్థితి
ఇదిలావుంటే, 2019 నుంచి కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి అధ్యక్షుడు లేడు. తాత్కాలిక హోదాలో సోనియాగాంధే నెట్టుకొస్తున్నారు. అందుకే ముందు పార్టీకి పూర్తిస్థాయి ప్రెసిడెంట్ అవసరం అన్నది G-23 గ్రూప్‌ నేతల ప్రధాన డిమాండ్. అందుకే అధ్యక్ష ఎన్నికలను కూడా ముందుగానే జరపాలని పట్టుబట్టే ఛాన్స్ ఉంది. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌లో ఎలక్షన్స్ జరగాలి. కానీ ప్రస్తుతం పరిస్థితి ఏమాత్రం బాగోలేదు కాబట్టి.. ముందుగానే ఈ ఎన్నికలు జరపాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది..అటు రాజ్యసభలోనూ కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది…

Read Also…

Congress: ఐదు రాష్ట్రాల ఓటమిపై కాంగ్రెస్‌లో అంతర్మథనం.. ఇవాళ్టి సీడబ్యూసీ భేటీలో సోనియా, రాహుల్ కీలక నిర్ణయం!

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Mar 2022 08:23 PM (IST)

    వీటిపైనే ప్రధాన చర్చ..

    ప్రధానంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై చర్చించారు. ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు, ఇన్చార్జిలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్లు, జీ-23 అసమ్మతి గ్రూపు నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఈ భేటీకి హాజరయ్యారు. కాగా, కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయాలని జీ-23 అసమ్మతి నేతలు సోనియా గాంధీకి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

  • 13 Mar 2022 07:14 PM (IST)

    సమావేశానికి హాజరైన 57మంది సభ్యులు

    ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు సంస్థాగత ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.  57మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

  • 13 Mar 2022 07:09 PM (IST)

    పక్షాళన చేయాలని డిమాండ్ చేసిన జీ-23 అసంతృప్తి నేతలు

    కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు సీడబ్లూసీ సమావేశం జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వాడి వేడి చర్చ జరిగింది. అధిష్టానానికి సవాళ్లు విసురుతున్న జీ-23 అసంతృప్తి నేతలు పార్టీని పక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.

  • 13 Mar 2022 07:07 PM (IST)

    ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ

    కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు సీడబ్లూసీ సమావేశం జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వాడి వేడి చర్చ జరిగింది. అధిష్టానానికి సవాళ్లు విసురుతున్న జీ-23 అసంతృప్తి నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

  • 13 Mar 2022 06:40 PM (IST)

    పార్టీని సంస్కరించాలి.. శశి థరూర్ తాజా ట్వీట్..

    కాంగ్రెస్ పార్టీ సంస్కరించడం, పునరుద్ధరించాల్సిన అవసరం చాలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ నొక్కిచెప్పారు. దేశవ్యాప్తంగా కౌంటీలోని ఆయా పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను థరూర్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. అతను పంచుకున్న జాబితా ప్రకారం..

  • 13 Mar 2022 05:58 PM (IST)

    రాహుల్‌కు పెరుగుతున్న మద్దతు..

    రాహుల్ గాంధీకి మద్దతు పెరుగుతోంది. అల్కా లాంబాతో సహా ఢిల్లీ కాంగ్రెస్ నాయకుల నేతృత్వంలోని బృందం గాంధీకి మద్దతు ప్రకటించారు. రాహుల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కీలకమైన CWC సమావేశం ప్రస్తుతం జరుగుతోంది.

  • 13 Mar 2022 04:53 PM (IST)

    మొబైల్ ఫోన్లు తీసుకెళ్లని సీనియర్ నేతలు

    గతంలో జరిగిన CWC సమావేశంలో తాను పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నానంటూ సోనియా చాలా సీరియస్‌గా చెప్పుకొచ్చారు. ఈ సమావేశానికి సోనియా గాంధీతో పాటుగా ఖర్గే.. అంబికా సోనీ, సల్మాన్ ఖుర్షీద్.. అజయ్ మకెన్, ప్రియాంక గాంధీ, చిదంబరం, అశోక్ గెహ్లాట్, భూపేష్ భగేల్, హరీష్ రావత్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే, ఈ సమావేశానికి నేతలు మొబైల్ ఫోన్లతో హాజరు కాకుండా సూచనలు చేసారు. దీంతో సమావేశంలో ఏ అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నారో భయటకు రావడం లేదు.

  • 13 Mar 2022 04:37 PM (IST)

    కాంగ్రెస్ సీనియర్ నేత బాలకృష్ణ వాస్నిక్ కుమారుడే ముకుల్ వాస్నిక్..

    ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నేత బాలకృష్ణ వాస్నిక్ కుమారుడే ముకుల్ వాస్నిక్. బాలకృష్ణ కూడా బుల్దానా నుంచి ఎంపీగా గెలిచారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా పేరుగడించారు. 1959 సెప్టెంబర్ 27న జన్మించిన ముకుల్ .. బీఎస్సీ గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత ఎంబీఏ చేసి .. రాజకీయాల్లోకి వచ్చారు. యూత్ కాంగ్రెస్ నేతగా చురుగ్గా పాల్గొన్నారు. 1984లో .. 25 ఏళ్లకే బుల్దానా లోక్ సభ నుంచి ఎంపీగా గెలచి రికార్డు సృష్టించారు.

  • 13 Mar 2022 04:34 PM (IST)

    ముకుల్ వాస్నిక్.. ఎవరో తెలుసా…

    ముకుల్ వాస్నిక్ .. మరాఠా నేత. మహారాష్ట్రకు చెందిన వాస్నిక్ పాతికేళ్ల ప్రాయంలోనే ఎంపీగా విజయం సాధించారు. అప్పటినుంచి ఆయన విజయయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఇబ్బందుల్లో ఉంది. దీంతో పార్టీకి పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు వాస్నిక్ అనుభవం కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆయనకు పార్టీ పరంగా, పరిపాలనపరంగా ఉన్న అనుభవం పార్టీకి మేలు చేస్తుందని జీ 23 నేతలు భావిస్తున్నారు.

  • 13 Mar 2022 04:29 PM (IST)

    పార్టీని రాహుల్ నడిపిస్తున్నాడు – జీ23 సభ్యుల ఆరోపణ

    సోనియా గాంధీ (తాత్కాలిక) అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ.. అది కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణదీప్ సూర్జేవాలాచే అన్ని నిర్ణయాలు జరుగుతున్నాయని జీ23 నేతలు ఆరోపిస్తున్నారు. వారిపై ఎటువంటి జవాబుదారీతనం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెర వెనుక నుంచి పార్టీని నడిపిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అధ్యక్షుడు కాదు.. కానీ అతను తెర వెనుక నుంచి ఆపరేట్ చేస్తారు. నిర్ణయాలు తీసుకుంటారు. అతను బహిరంగంగా కమ్యూనికేట్ చేయడు. అంటూ జీ23 నేతలు మండిపడ్డారు. “మేము పార్టీ శ్రేయోభిలాషులం, శత్రువులం కాదు” అని మరోసారి గుర్తు చేశారు.

  • 13 Mar 2022 04:18 PM (IST)

    వాడివేడిగా సీడబ్లూసీ సమావేశం.. తీవ్ర ఉత్కంఠ

    వాడివేడిగా సీడబ్లూసీ సమావేశం జరుగుతోంది. సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా తప్పకుంటారా ? వేరే వాళ్లకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా ? అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

  • 13 Mar 2022 03:52 PM (IST)

    బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ – కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మాణికం ఠాగూర్

    బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మాణికం ఠాగూర్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షం, కాబట్టి విమర్శలన్నీ కాంగ్రెస్ వైపు మాత్రమే ఉంటాయన్నారు. మాణికం ఠాగూర్ రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. “రాహుల్ గాంధీజీ మమ్మల్ని ఆదర్శంగా నడిపించారు. 2019 లోక్‌సభ ఓటమి తర్వాత ఆయన తన రాజీనామాను సమర్పించారు. అందుకే, కాంగ్రెస్‌లో ఆయన దారి చూపే నాయకుడు. కాంగ్రెస్ కార్యకర్తలుగా రాహుల్ గాంధీజీ రాజీనామాను వెనక్కి తీసుకోవాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. ఆయన మమ్మల్ని ముందుండి నడిపించవలసి ఉంటుంది. భవిష్యత్తులో రాహుల్‌జీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని మేము ఆశిస్తున్నాము. అంటూ ట్వీట్ చేశారు.

     

  • 13 Mar 2022 03:41 PM (IST)

    రాహుల్‌కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలి-అశోక్ గెహ్లాట్

    రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అప్పగించాలని డిమాండ్ చేశారు. రాహుల్‌కు పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వకపోవడం వల్లే పార్టీ ఓడిపోతుందని అన్నారు. మీడియా ఇతర సంస్థలు ఒత్తిడిలో ఉన్నాయన్నారు. గాంధీలను నిందించేది మీడియా అని గెహ్లాట్ అన్నారు.

  • 13 Mar 2022 03:30 PM (IST)

    కాంగ్రెస్‌పూ బీజేపీ తప్పుడు ప్రచారం – రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్

    పోలరైజేషన్ రాజకీయాలు తేలిక.. కాంగ్రెస్‌ను ముస్లిం పార్టీగా బీజేపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసిందని రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడుకోవడమే కాంగ్రెస్ మార్గమన్నారు. ఎన్నికల సమయంలో మతం తెరపైకి వస్తుంది. అయితే ద్రవ్యోల్బణం , ఉద్యోగాల సమస్యలను బిజెపి పక్కన పెట్టిందని అన్నారు.

     

  • 13 Mar 2022 03:24 PM (IST)

    పార్టీ అధ్యక్ష పదవికి ముకుల్ వాస్నిక్‌కు ఛాన్స్..?

    పార్టీ అధ్యక్ష పదవికి ముకుల్ వాస్నిక్‌ను సూచించింది పార్టీలోని అసమ్మతి వర్గం జి 23. అది అంగీకరించలేదని వర్గాలు చెబుతున్నాయి. “ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్‌లతో కూడిన జి 23, పార్టీ అధ్యక్ష పదవికి ముకుల్ వాస్నిక్ పేరును సూచించారు.

  • 13 Mar 2022 12:23 PM (IST)

    సంస్థాగత ఎన్నికలపై పార్టీ ఫోకస్ః అభిషేక్

    భవిష్యత్ ఎన్నికలలో ఆశించిన ఫలితాల కోసం పార్టీ పునర్నిర్మాణం చేపడుతున్నట్లు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి అన్నారు.ఈ ఏడాది చివర్లో జరగనున్న సంస్థాగత ఎన్నికలపై పార్టీ ఫోకస్ చేసిందన్నారు. అయితే, అగ్ర నాయకత్వంలో ఎలాంటి మార్పు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

  • 13 Mar 2022 12:21 PM (IST)

    పార్టీ నాయకత్వంలో ఎలాంటి మార్పులు లేవుః అధీర్ రంజన్

    లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ పక్షనేత అధీర్‌ రంజన్‌ చౌదరి ఈ అంశాలను ప్రస్తావించగా, రాహుల్‌, ప్రియాంక గాంధీ హృదయపూర్వకంగా ప్రయత్నాలు చేస్తున్నందున పార్టీ అగ్ర నాయకత్వంలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.

  • 13 Mar 2022 11:53 AM (IST)

    ప్రజల విశ్వాసాన్ని పొందుతాంస మల్లికార్జున్ ఖర్గే

    కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని దురదృష్టకరం అని అభివర్ణించారు.కాంగ్రెస్ అతి త్వరలో ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • 13 Mar 2022 11:51 AM (IST)

    ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయంః మల్లికార్జున్ ఖర్గే

    కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చలు జరిపామన్నారు. ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చే పౌరులు, వైద్య విద్యార్థులకు సహాయం, రైతు సమస్యలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, MSP సమస్యలను పార్లమెంటు ఉభయ సభలో నిలదీయాలని నిర్ణయించామని రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.

  • 13 Mar 2022 11:49 AM (IST)

    ముగిసిన కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ భేటీ

    కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం ముగిసింది. కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, ఆనంద్ శర్మ, కె. సురేష్, జైరాం రమేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

    Congress

     

  • 13 Mar 2022 11:41 AM (IST)

    పార్టీకి పూర్తిస్థాయి ప్రెసిడెంట్ అవసరం

    2019 నుంచి కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి అధ్యక్షుడు లేడు. తాత్కాలిక హోదాలో సోనియాగాంధే నెట్టుకొస్తున్నారు. అందుకే ముందు పార్టీకి పూర్తిస్థాయి ప్రెసిడెంట్ అవసరం అన్నది G-23 గ్రూప్‌ నేతల ప్రధాన డిమాండ్. అందుకే అధ్యక్ష ఎన్నికలను కూడా ముందుగానే జరపాలని పట్టుబట్టే ఛాన్స్ ఉంది. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌లో ఎలక్షన్స్ జరగాలి. కానీ ప్రస్తుతం పరిస్థితి ఏమాత్రం బాగోలేదు కాబట్టి.. ముందుగానే ఈ ఎన్నికలు జరపాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది..

  • 13 Mar 2022 11:40 AM (IST)

    సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీ పార్టీ పదువులకు రాజీనామా?

    సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీ పార్టీ పదువుల నుంచి తప్పుకుంటురాన్న ప్రచారమూ జోరుగా సాగింది. ప్రస్తుతానికైతే అలాంటిదేమీ లేదని కాంగ్రెస్‌ నుంచి వివరణ వచ్చినా.. అంతర్గంగా పరిస్థితులు ఏమాత్రమూ బాగోలేదన్నది స్పష్టంగా తెలుస్తూనే ఉంది…

  • 13 Mar 2022 11:40 AM (IST)

    నిరాశపర్చిన ప్రియాంక వాద్రా

    కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోస్తారని.. నిన్న, మొన్నటి వరకు ప్రియాంకపై కాస్తో..కూస్తో ఆశలు ఉన్నా.. ఇప్పుడు అవి కూడా ఆవిరైనట్లే.. కనిపిస్తోంది! యూపీలో కాలుకి బలపం కట్టుకొని తిరిగినా..  అక్కడ ఆ పార్టీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది.

  • 13 Mar 2022 11:37 AM (IST)

    కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్న ప్రశ్నలు ఇవే…

    అప్రతిహతంగా దూసుకెళ్తున్న BJPని తట్టుకునేదెలా?

    కాంగ్రెస్‌ పార్టీని ఉనికిలో ఉంచేది ఎలా?

    వరుస ఓటములు, నాయకత్వ వైఫల్యాల నుంచి బయటపడేదెలా..?

    ఇంకో రెండేళ్లలో వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేది ఎలా?

    పార్టీని కాపు కాసేదెవరు? నడిపించేదెవరు?

    దేశవ్యాప్తంగా డీలాపడుతున్న పార్టీని ముందుకు తీసుకెళ్లేదెవరు?

  • 13 Mar 2022 11:32 AM (IST)

    నాయకత్వ మార్పుతో సహా సంస్థాగత ప్రక్షాళన

    గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పుదుచ్చేరిలో కాంగ్రెస్ ఓడిపోయి, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో రాణించలేకపోయిన తర్వాత జి-23 నేతలు దిద్దుబాటు చర్యలను సూచించారు. నాయకత్వ మార్పుతో సహా సంస్థాగతంగా ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేశారు.

  • 13 Mar 2022 11:30 AM (IST)

    ‘జీ23’ గ్రూపు వీడిన జితిన్ ప్రసాద్, యోగానంద శాస్త్రి

    కాంగ్రెస్‌లోని యాక్టివ్ ప్రెసిడెంట్ మరియు సంస్థలో సమూల మార్పు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ 2020 ఆగస్టులో కాంగ్రెస్ ‘జీ23’ గ్రూపు నేతలు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ గ్రూపులోని ఇద్దరు నేతలు జితిన్ ప్రసాద్, యోగానంద శాస్త్రి ఇప్పుడు కాంగ్రెస్‌ను వీడారు.

  • 13 Mar 2022 11:21 AM (IST)

    రాజీనామా వార్తలు అవాస్తవంః రణదీప్ సూర్జేవాలా

    గాంధీ కుటుంబ సభ్యులు సోనియా, రాహుల్, ప్రియాంక గాందీలు అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేస్తారంటూ వచ్చిన వార్తలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆదివారం తోసిపుచ్చారు. పార్టీలో పెద్ద మార్పును ఆయన తిరస్కరించారు. రాజీనామా ఆరోపణలపై వచ్చిన వార్తలు అన్యాయమైనవి, దుర్మార్గమైనవి, పూర్తిగా అవాస్తవమని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నిరాధారమైన ప్రచార కథనాలను టీవీ ఛానెల్ ప్రసారం చేయడం సరికాదని సూర్జేవాలా అన్నారు.

  • 13 Mar 2022 11:16 AM (IST)

    జీ-23 గ్రూపు నేతల భేటీ

    అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత, పార్టీ జి 23 గ్రూపులోని పలువురు నేతలు శుక్రవారం కూడా సమావేశమయ్యారు, ఇందులో ముందస్తు వ్యూహంపై చర్చించారు.

  • 13 Mar 2022 11:15 AM (IST)

    ఒకేరోజు రెండు కీలక సమావేశాలు

    పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో ఘోర పరాజయాన్ని చవిచూసిన తరుణంలో ఒకేరోజు రెండు కీలక సమావేశాలు జరగుతున్నాయి.

  • 13 Mar 2022 11:14 AM (IST)

    పార్లమెంటు సమావేశాలకు వ్యూహం సిద్ధంః సురేష్

    ఈ సమావేశానికి సంబంధించి కె.సురేష్‌ మాట్లాడుతూ.. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల రెండో విభాగానికి వ్యూహం సిద్ధం చేస్తున్నామన్నారు.

  • 13 Mar 2022 11:13 AM (IST)

    హాజరైన మల్లికార్జున్ ఖర్గే, ఆనంద్ శర్మ

    సోనియా గాంధీ నివాసం 10 జన్‌పథ్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశానికి సీనియర్ పార్టీ నేతలు హాజరయ్యారు. రాజ్యసభ పక్ష్ నేత మల్లికార్జున్ ఖర్గే, ఆనంద్ శర్మ, కె సురేష్, జైరాం రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలపై పోస్టుమార్టం నిర్వహింస్తున్నట్లు తెలుస్తోంది.

  • 13 Mar 2022 11:03 AM (IST)

    కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాలు

    కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే అత్యంత ఉన్నత స్థాయు సంఘం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సంస్థాగత ఎన్నికలపై నేడు చర్చ జరుగనుంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తికాలం పనిచేసే అధినేత ఉండాలని, అన్ని స్థాయిల్లో ప్రక్షాళన చేయాలని పార్టీ సీనియర్ అసమ్మతి నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది.

  • 13 Mar 2022 11:00 AM (IST)

    సీడబ్ల్యూసీ కీలక భేటీ

    ఇటీవల దేశంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. గత ఎన్నికల్లో పంజాబ్‌ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్‌.. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్రాన్ని కూడా చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అవుతోంది.

Follow us on