Watch Video: ప్రియాంక గాంధీ క్రేజ్‌ అంటే ఇలా ఉంటది మరి.. స్వాగతం పలికేందుకు పూలతో రెడ్ కార్పెట్‌..

ప్లీనరి సమావేశాలకు ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లను చేసింది. పార్టీ ప్రతినిధులకు బసతో సహా.. పసందైన ఆహార వంటలు.. దీంతోపాటు మైమరిచిపోయేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దింది. అయితే, ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Watch Video: ప్రియాంక గాంధీ క్రేజ్‌ అంటే ఇలా ఉంటది మరి.. స్వాగతం పలికేందుకు పూలతో రెడ్ కార్పెట్‌..
Priyanka Gandhi

Updated on: Feb 25, 2023 | 3:50 PM

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్లీనరీలో 15,000 మంది పార్టీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సమావేశాల్లో ఇతర పార్టీలతో పొత్తు, 2024 లోక్‌సభ ఎన్నికలకు రోడ్ మ్యాప్‌, పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలతోపాటు పలు కీలక నిర్ణయాల గురించి చర్చించి తీర్మానాలు చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సమావేశాలు జరుగుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా.. ఈ ప్లీనరి సమావేశాలకు ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లను చేసింది. పార్టీ ప్రతినిధులకు బసతో సహా.. పసందైన ఆహార వంటలు.. దీంతోపాటు మైమరిచిపోయేలా ప్రాంగణాన్ని తీర్చిదిద్దింది. అయితే, ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రియాంక గాంధీ సహా పలు అగ్ర నాయకులను ఆహ్వానించేందుకు ఏకంగా గులాబీ పూలతో రెడ్‌ కార్పెట్‌ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఇతర పార్టీ నాయకులకు స్వాగతం పలికేందుకు ఒక వీధిలో పూలతో రెడ్‌ కార్పెట్‌ వేసిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశానికి హాజరయ్యేందుకు ఆ పార్టీ నేతలు రాయ్‌పూర్‌ జిల్లాకు వచ్చారు. అయితే, ప్రియాంక గాంధీకి స్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు గులాబీ కార్పెట్‌ ఏర్పాటు చేశారు. వేలాది కిలోల గులాబీల రేకులను ప్రియాంక వచ్చే రోడ్డుపై పరచి కాంగ్రెస్‌ కార్యకర్తలు సాదర స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసిన దృశ్యాలను ఈ వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

అంతకుముందు రాష్ట్ర సీఎం భూపేష్ బఘెల్ కూడా ప్రియాంకను విమానాశ్రయంలో పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కాగా, రెండోరోజు ప్లీనరీ సమావేశాల్లో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ప్రసంగించారు. రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించి ప్రస్తావిస్తూ.. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందని.. భారత్ జోడో యాత్ర పార్టీకి ఒక టర్నింగ్ పాయింట్ అంటూ ఈ సందర్భంగా సోనియా అభివర్ణించారు. దేశ ప్రజలంతా సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసిందంటూ సోనియా తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..