AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Assembly Elections: మోడీ-యోగి సర్కార్లపై ఫైర్.. వర్చువల్ ర్యాలీలో ప్రసంగించిన సోనియా..

Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అగ్రనేతల క్యాంపెయిన్‌తో ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కుతోంది. యూపీలో పాగా వేసేందుకు శక్తియుక్తులూ కూడగడుతున్నాయి ప్రధాన పార్టీలు.

UP Assembly Elections: మోడీ-యోగి సర్కార్లపై ఫైర్.. వర్చువల్ ర్యాలీలో ప్రసంగించిన సోనియా..
Sonia Gandhi
Sanjay Kasula
|

Updated on: Feb 21, 2022 | 3:53 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల(UP Assembly Election) ప్రచారం ఊపందుకుంది. అగ్రనేతల క్యాంపెయిన్‌తో ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కుతోంది. యూపీలో పాగా వేసేందుకు శక్తియుక్తులూ కూడగడుతున్నాయి ప్రధాన పార్టీలు. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) అసెంబ్లీ ఎన్నికల ప్రచార బరిలో దిగారు. సోమవారం యూపీలో జరిగిన వర్చువల్ ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్బంగా బీజేపీ(BJP)  ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM MODI), ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath ) ప్రభుత్వాల వైఫల్యాలను ప్రధానంగా తన ప్రసంగంలో ప్రస్తావించారు. బీజేపీ ప్రభుత్వం హయంలో ఉద్యోగ అవకాశాలు లేక యువత ఇంట్లో కూర్చోవాల్సి వచ్చిందన్నారు. విభజన సృష్టించడం తప్ప చేసిందేమీ లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 12 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. పెట్రోల్‌-డీజిల్‌, ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా మారిందన్నారు.

యూపీలో బీజేపీ యువతకు ఉపాధి కల్పించలేదని.. ఎలాంటి ఉపశమనం కల్పించలేదన్నారు. కాంగ్రెస్ చేసిన అన్ని ప్రయత్నాలను కరోనా సమయంలో బీజేపీ అడ్డుకుందన్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ప్రతి మహిళలకు ఇళ్లు గడవడమే కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, రాయ్‌బరేలీ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులు, చిరు వ్యాపారులు.. అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. వందలాది కిలోమీటర్లు కాలి నడకన నడవాల్సిన ఆందోళనకర దుస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయని మండిపడ్డారు. వేలాదిమంది వలస కార్మికులు బాధలను పట్టించుకోవడంలో కేంద్రంలో ప్రధాని మోడీ- రాష్ట్రంలో ముఖ్యమంత్రి యోగి విఫలం అయ్యాయని విమర్శలు గుప్పించారు. ఎలాంటి ఆర్థిక సహకారాన్ని అందించలేకపోయాయని అన్నారు.

కార్మికులను జైలుకు పంపారు..

ఉత్తరప్రదేశ్ హక్కుల కోసం పోరాడిన 18,000 మంది కార్మికులను జైలుకు పంపారని విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు దేశ మార్పు, అభివృద్ధికి కాంగ్రెస్ ఎన్నో పనులు చేసిందని సోనియా గాంధీ గుర్తు చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయడమే మా ఉద్దేశమని అన్నారు. యూపీలో ప్రజలు ఈసారి కాంగ్రెస్‌ను విశ్వసిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.

నాలుగో దశ పోలింగ్ ఫిబ్రవరి 23న..

ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటికే మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 10, 14, 20వ తేదీల్లో మొత్తం 172 స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక నాలుగు విడతల పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. నాలుగో దశలో 9 జిల్లాల్లోని 59 స్థానాలకు ఫిబ్రవరి 23న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది. ఈ పరిస్థితుల్లో దాదాపు అన్ని పార్టీలు కూడా తమ ప్రచారాన్ని మరింత వేగం పెంచాయి. ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:  Goutham Reddy Death Live Updates: పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులు

PM Narendra Modi: అలా అస్సలు చేయొద్దు.. బీజేపీ నేతకు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..