Congress: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. వీరికి కీలక పదవులు కేటాయించిన అధిష్టానం

|

Dec 23, 2023 | 10:05 PM

దేశంలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో పరాజయం చవిచూసింది. దీంతో లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అందులో భాగంగానే రాష్ట్రాల వారిగా అధ్యక్షులను మార్పులు చేర్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న అధ్యక్ష పదవుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసింది.

Congress: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. వీరికి కీలక పదవులు కేటాయించిన అధిష్టానం
Congress Party
Follow us on

దేశంలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో పరాజయం చవిచూసింది. దీంతో లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అందులో భాగంగానే రాష్ట్రాల వారిగా అధ్యక్షులను మార్పులు చేర్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న అధ్యక్ష పదవుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాలు చూసుకుంటున్న మాణిక్‌రావు ఠాక్రేను బాధ్యతల నుంచి తప్పించారు. ఆయనను గోవా, దామన్‌-డయ్యూ, దాద్రా నగర్‌ హవేలీ బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు పరిశీలకులుగా వ్యవహరించిన దీపాదాస్‌ మున్షికి కేరళ, లక్ష్యద్వీప్‌తో పాటు తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. గతంలో తెలంగాణ వ్యవహారాల బాధ్యులుగా ఉన్న మాణికం ఠాగూర్‌కు అంధ్రప్రదేశ్, అండమాన్‌ నికోబార్‌ వ్యవహారాలను చూసుకునేలా ఆదేశాలు జారీ చేశారు.

ఇక రాజస్థాన్‌ మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. ఛత్తీస్‌గఢ్‌ ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా కీలక బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం ఉత్తర్‎ప్రదేశ్ బాధ్యతలు చూస్తున్న ప్రియాంక గాంధీని ఆ స్థానం నుంచి తప్పించి.. అవినాశ్‌ పాండేకు ఆ రాష్ట్ర బాధ్యతలను కట్టబెట్టింది. అజయ్‌ మాకెన్‌ను ట్రెజరర్‌గా, మిలింద్‌ దియోరా, విజయ్‌ ఇందర్‌ సింగ్లా జాయింట్‌ ట్రెజరర్లుగా వ్యవహరించనున్నారు. జనరల్‌ సెక్రటరీగా ఉన్న తారిక్‌ అన్వర్‌ను, ఇన్‌ఛార్జులుగా ఉన్న భక్తచరణ్‌ దాస్‌, హరీశ్‌ చౌదరి, రజనీ పాటిల్‌, మనీశ్‌ చత్రాఠ్‌ను ఆయా బాధ్యతల నుంచి తప్పించారు. అలాగే ఇప్పటి వరకూ పార్టీలో ప్రధాన భూమిక పోషించిన ప్రియాంకకు ఎలాంటి బాధ్యతలూ అప్పగించలేదని స్పష్టమవుతోంది. ఈ నియామకాలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేపట్టినట్లు పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..