Ghulam Nabi: ఆయనకు పద్మ భూషణ్‌పై రెండుగా విడిపోయిన కాంగ్రెస్ నాయకత్వం..

|

Jan 26, 2022 | 4:55 PM

ఇప్పుడు మళ్లీ పద్మాలపై చర్చ మొదలైంది. కొందరు మాకొద్దంటే.. మరికొందరు ఆయనకు ఎందుకిచ్చారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్​కు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించడంపై..

Ghulam Nabi: ఆయనకు పద్మ భూషణ్‌పై రెండుగా విడిపోయిన కాంగ్రెస్ నాయకత్వం..
Ghulam Nabi
Follow us on

ఇప్పుడు మళ్లీ పద్మాలపై చర్చ మొదలైంది. కొందరు మాకొద్దంటే.. మరికొందరు ఆయనకు ఎందుకిచ్చారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్​కు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించడంపై ఆ పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గులాం నబీ ఆజాద్​పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పరోక్షంగా విమర్శలు గుప్పిస్తే.. మరోవైపు, జీ23 నేతల్లో ఒకరైన కపిల్ సిబల్.. కేంద్రం ప్రకటనను స్వాగతించారు. కాంగ్రెస్​ తీరును తప్పుబట్టారు. బంగాల్ మాజీ ముఖ్యమంత్రి, వామపక్ష నేత బుద్ధదేవ్ భట్టాచార్య తనకు ప్రకటించిన పద్మభూషణ్​ అవార్డును తిరస్కరించారన్న వార్తలను ప్రస్తావిస్తూ.. గులాం నబీ ఆజాద్​పై పరోక్ష విమర్శలు చేశారు. అవార్డును తిరస్కరించి బుద్ధదేవ్ సరైన పనే చేశారని జైరాం రమేశ్ అన్నారు. ‘బుద్ధదేవ్ ఆజాదీగా ఉండాలనుకుంటున్నారు. గులాంగా కాదు’ అంటూ ట్విట్టర్​ చేశారు.

ఇదే అంశంపై కాంగ్రెస్ నాయకత్వాన్ని సంస్కరించాలంటూ లేఖ రాసిన నేతల్లో(జీ-23 ) ఒకరైన కపిల్ సిబల్.. ఆజాద్​కు పద్మ పురస్కారం రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో పార్టీ అధిష్ఠానానికి చురకలు అంటించారు. ప్రజలకు ఆజాద్ చేసిన సేవను దేశమంతా గుర్తిస్తోందని, తన సొంత పార్టీ మాత్రం ఆయన సేవలను కోరుకోవడం లేదని కామెంట్ చేశారు. ఇది విచిత్రంగా ఉందని అన్నారు.

ఇవి కూడా చదవండి: Long Hair Tips: పట్టుకుచ్చుల్లా మెరిసిపోయే కురులు కావాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి..

Mudragada-Ap CM: కొత్త జిల్లాలకు వీరి పేర్లు పెట్టండి.. సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ..