Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం.. 9 రోజుల విరామం అనంతరం మళ్లీ..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటి నుంచి పునఃప్రారంభం కానుంది. శీతాకాలం 9 రోజుల విరామం అనంతరం మళ్లీ ప్రారంభమవనుంది. ఇప్పటి వరకు యాత్ర 110 రోజులు, 3000 కి.మీ సాగింది....

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం.. 9 రోజుల విరామం అనంతరం మళ్లీ..
Rahul Gandhi
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 03, 2023 | 8:48 AM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటి నుంచి పునఃప్రారంభం కానుంది. శీతాకాలం 9 రోజుల విరామం అనంతరం మళ్లీ ప్రారంభమవనుంది. ఇప్పటి వరకు యాత్ర 110 రోజులు, 3000 కి.మీ సాగింది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి వద్ద ప్రారంభమైన యాత్ర.. తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల మీదుగా సాగి ఢిల్లీ వరకు చేరుకుంది. ఈ రోజు ఉదయం ఢిల్లీ లోని ఎర్రకోట సమీపంలోని హనుమాన్ దేవాలయం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. 12 గంటలకు సరిహద్దు అయిన ‘లోని’ కి చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఈ పాదయాత్ర మొత్తం 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ముగిసింది. ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్‌ల మీదుగా జమ్ముకశ్మీర్‌ చేరుకుంటుందని తెలిపారు. జనవరి 30న జాతీయ జెండా ఆవిష్కరణతో యాత్ర ముగియనుంది.

చివరి రోజు యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే సభలో రాహుల్‌ ప్రసంగిస్తారు. ఈ యాత్ర కాంగ్రెస్‌ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. జోడో యాత్రలో తాము కూడా పాల్గొంటామని జేడీయూ ప్రకటించింది. నితీశ్‌ మాత్రం యాత్రకు దూరంగా ఉంటారని తెలిపారు. బుధవారం షామ్లీ మీదుగా వెళ్లి జనవరి 5 సాయంత్రం పానిపట్‌లోని సనౌలీ మీదుగా హర్యానాలోకి ఈ యాత్ర ప్రవేశించనుంది. వర్షాకాలంలో కూడా రాహుల్ వానలో తడుస్తూ పాదయాత్ర చెప్పట్టారు. శీతాకాలంలో కొంచెం బ్రేక్ ఇచ్చి.. ఇవాళ్టి నుంచి యాత్ర పునఃప్రారంభిస్తారు.

భారతీయ జనతా పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలనుంది. భారత్‌ జోడో యాత్రకు విపక్షాలు అనుకూలంగానే ఉన్నాయి. హింస, విద్వేషాలకు తావులేని సమైక్య భారత్‌ను కోరుకునే వారందరికీ యాత్రలో కలిసి నడవటానికి ఆహ్వానం పలుకుతున్నాం.

ఇవి కూడా చదవండి

     – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నేత (గతంలో చేసిన వ్యాఖ్యలు)

మరిన్ని జాతీయ వార్తల కోసం..