Rahul Gandhi – Gujarat: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ గుజరాత్‌లో పర్యటించారు. అక్కడి ద్వారకాధీశ్ ఆలయానికి వెళ్లి, శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు రాహుల్. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించేందుకు రాహుల్ అక్కడకు వెళ్లినట్టు తెలుస్తోంది. మూడు రోజుల పాటు చింతన్ సమీపంలో ఏర్పాటు చేసిన సదస్సులోనూ పాల్గొన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ కోటగా ఉన్న ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి ఈ పర్యటనను నాందిగా భావిస్తున్నారు నేతలు. ఈసారి గుజరాత్‌లో ఎలాగైనా గెలుపొందాలని వ్యూహం రచిస్తోంది కాంగ్రెస్. అందుకే రాహుల్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ పర్యటనలో అక్కడి నేతలకు ఓ టాస్క్ అప్పజెప్పారు కాంగ్రెస్ మెయిన్ లీడర్. పార్టీలో కౌరవ పాత్ర పోషించే నేతల జాబితాను వెంటనే తయారు చేసి, వారిని గుర్తించాలని ఆదేశించారు రాహుల్. ప్రజల్లోకి వెళ్లకుండా, కేవలం పార్టీ కార్యాలయంలో ఏసీలో హాయిగా కూర్చుని వుండే వారి పేర్లను ఇవ్వాలని స్పష్టం చేశారాయన. పనిచేసే నేతలను చెడగొట్టే వారి జాబితాను వెంటనే రూపొందించాలని పార్టీ నేతలను ఆదేశించారు. కేవలం ఏసీలో కూర్చునే వారందరూ బీజేపీలో చేరిపోతున్నారని ఎద్దేవా చేశారు రాహుల్. విపక్ష నేతలందరిపైకీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని, చివరికి న్యాయమే గెలుస్తుందని కామెంట్ చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత. బీజేపీ రాజకీయాల వల్లే గుజరాత్ ఇలా తయారైందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్. 2017లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శించారు రాహుల్ గాంధీ.
Also read:
Covid 4th Wave: కరోనా ఫోర్త్ వేవ్ ఎంట్రీ.. కీలక ప్రకటన చేసిన శాస్త్రవేత్తలు..!
Defection Case: గోవాలో ఫిరాయింపులపై కాంగ్రెస్ ఫోకస్.. మరో అవకాశం దిశగా ఆ పార్టీ అడుగులు..