Rahul Gandhi: కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆర్ఎస్‌ఎస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ ను ‘సంఘ్ పరివార్’ అని ఇకపై పిలవబోనని స్పష్టం చేశారు. యూపీలో కేరళకు చెందిన సన్యాసినిని ఇతర సన్యాసులు వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రాహుల్ గాంధీ.. సంఘ్ పరివార్ చేస్తున్న దుర్మార్గపు ప్రచారం ద్వారా సమాజంలోని రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. గురువారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ఇవాళ్టి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లేదా ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సమూహాలను ‘సంఘ్ పరివార్’ అని పిలవడం సరైంది కాదన్నారు. సంఘ్ పరివార్ అంటే..ఐక్య కుటుంబం అని చెప్పుకొచ్చిన రాహుల్ గాంధీ.. ఒక కుటుంబంలో మహిళలు, పెద్దలు, వారి పట్ల గౌరవ భావం, కరుణ, అప్యాయత కలిగి ఉంటారన్నారు. కానీ ఈ ఆర్ఎస్ఎస్‌కు దేనితోనూ సంబంధాలు లేవు అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలను సంఘ్ పరివార్ అని పిలవడం సరైంది కాదని నేను నమ్ముతున్నాను. కుటుంబంలో మహిళలు ఉన్నారు, వృద్ధుల పట్ల గౌరవం ఉంది, కరుణ, ఆప్యాయత ఉంది. ఇది ఆర్ఎస్ఎస్‌లో లేదు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆ కారణంగానే ఆర్ఎస్ఎస్‌ను ఇక నుంచి సంఘ్ పరివార్ అని పిలవబోను అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Also read: