‘పార్లమెంట్ కోసమే మాస్క్ ధరిస్తారా’..? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడి సంచలన వ్యాఖ్యలు..

|

Dec 24, 2022 | 11:29 AM

కాంగ్రెస్ ఎంపీ, పార్టీ కమ్యూనికేషన్స్ హెడ్ జైరాం రమేష్ బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు మాస్క్‌ ధరించారని, అయితే తర్వాత దానిని తొలగించారని ఆరోపించారు. తాను, కాంగ్రెస్‌లోని..

‘పార్లమెంట్ కోసమే మాస్క్ ధరిస్తారా’..? ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడి సంచలన వ్యాఖ్యలు..
Jairam Ramesh On Pm Modi
Follow us on

చైనాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కోవిడ్ ప్రోటోకాల్‌ను తప్పక అనుసరించాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య మంత్రి లేఖ రాసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ లేఖకు స్పందించిన కాంగ్రెస్ ఎంపీ, పార్టీ కమ్యూనికేషన్స్ హెడ్ జైరాం రమేష్ బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు వచ్చే సమయంలో మాస్క్‌ ధరించారని, అయితే తర్వాత దానిని తొలగించారని ఆరోపించారు. తాను, కాంగ్రెస్‌లోని ఇతర నాయకులు అన్ని రకాల ప్రోటోకాల్స్‌ను సక్రమంగా పాటిస్తామని రమేష్ తెలిపారు. రమేశ్ మాట్లాడుతూ..‘‘నేను మాస్క్ ధరిస్తాను. ప్రధాన మంత్రి  పార్లమెంటుకు నిన్న మాస్క్ ధరించి వచ్చారు. కానీ తరువాత ఆయన ముఖానికి అది లేదు. ప్రభుత్వం జారీ చేసిన అన్ని ప్రోటోకాల్‌లను మేము అనుసరిస్తాము. కోవిడ్‌పై బీజేపీ రాజకీయాలు చేయడంతోపాటు భారత్ జోడో యాత్ర గురించి తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నార’’ని అన్నారు.

ఇంకా ప్రశ్నలు లేవనెత్తడం ప్రభుత్వ పని కాదని, సమాధానాలు ఇవ్వడం, నియమాలు ఇంకా  ప్రోటోకాల్‌లను ప్రకటించడం దాని విధి అని జైరాంరమేష్ పేర్కొన్నారు. ‘‘మేము అన్ని రకాల కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటిస్తాము. విమానాశ్రయాలలో, బహిరంగ ప్రదేశాలలో మాస్కులను తప్పనిసరిగా ధరించమని వారికి చెప్పాలి. బీజేపీ కరోనాపై కూడా రాజకీయాలు చేస్తోంది’’ అని ఆయన మండిపడ్డారు. ప్రకటించాలి. వారు మాత్రమే చేస్తున్నారు. రాజకీయాలు’’

ఇవి కూడా చదవండి


కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర శనివారం(డిసెంబర్ 24) తెల్లవారుజామున ఢిల్లీలోకి ప్రవేశించింది. ఆ సందర్భంగా ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ చౌదరితో సహా పార్టీ కార్యకర్తలు రాహుల్‌, ఇంకా ఇతర నాయకులకు స్వాగతం పలికారు. జోడో యాత్ర హర్యానాలోని ఫరీదాబాద్ వైపు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది. యాత్రలో భాగంగా హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా, రణదీప్ సూర్జేవాలా, శక్తిసిన్హ్ గోహిల్ తదితర పార్టీల సీనియర్ నేతలు రాహుల్ గాంధీ వెంట ఉన్నారు.