Priyanka Gandhi Vadra: కాంగ్రెస్ ప్రచారానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం అర్థాంతరంగా రద్దయ్యింది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా సోకింది. దాంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆమె కూడా సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు. అయితే, ప్రియాంక గాంధీ కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోగా.. నెగిటివ్ అని తేలింది. అయినప్పటికీ వైద్యుల సూచనల మేరకు ఆమె సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రియాంకా గాంధీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాను కరోనా పరీక్ష చేయించుకోగా.. నెగిటివ్ అని తేలిందని, అయితే, వైద్యుల సూచనల మేరకు సెల్ఫ్ క్వారంటైన్ అయినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
కాగా, కాంగ్రెస్ ఎంపీ హెచ్ వసంత్ కుమార్ మరణంతో కన్యాకుమారి పార్లమెంట్ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానానికి కూడా తమిళనాడు అసెంబ్లీతో పాటే పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున వి. విజయకుమార్‌ను నిలబెట్టగా.. ఆయనకు మద్ధతుగా ప్రియాంకా గాంధీ ప్రచారం చేయాల్సి ఉంది. ఏప్రిల్ 6వ తేదీనే ఎన్నికలు ఉండగా.. ఇంతలో ప్రియాంక గాంధీ సెల్ఫ్ క్వారెంటైన్ అవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యాయి.
ప్రియాంక గాంధీ అసెంబ్లీ ఎన్నికలున్న అస్సాం, కేరళ రాష్ట్రాలలో చురుకుగా ప్రచారం చేస్తున్నారు. తమిళనాడులోనూ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె ఇప్పటివరకు అస్సాంలో రెండుసార్లు పర్యటించగా.. మూడోసారి ఇవాళ పర్యటించాల్సి ఉంది. ఇంతలో కరోనా విషయం తెలియడంతో ప్రియాంక గాంధీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగే ర్యాలీలలో కూడా ఆమె ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ, ఆ పర్యటన కూడా రద్దు అవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి.
Priyanka Gandhi Vadra Tweet:
हाल में कोरोना संक्रमण के संपर्क में आने के चलते मुझे अपना असम दौरा रद्द करना पड़ रहा है। मेरी कल की रिपोर्ट नेगेटिव आई है मगर डॉक्टरों की सलाह पर मैं अगले कुछ दिनों तक आइसोलेशन में रहूँगी। इस असुविधा के लिए मैं आप सभी से क्षमाप्रार्थी हूँ। मैं कांग्रेस विजय की प्रार्थना करती हूँ pic.twitter.com/B1PlDyR8rc
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 2, 2021
Also read: