Congress President Election: గెహ్లాట్ కాదు.. ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్‌కి ఈ నాయకుడే మొదటి ఎంపిక.. కానీ రాహుల్ మదిలో ఎవరు..?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో రోజుకో కొత్త పేరు చర్చలోకి వస్తోంది. ఇప్పుడు ఈ రేసులో మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పేరు కూడా వచ్చి చేరింది.

Congress President Election: గెహ్లాట్ కాదు.. ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్‌కి ఈ నాయకుడే మొదటి ఎంపిక.. కానీ రాహుల్ మదిలో ఎవరు..?
Rahul Gandhi and Sonia Gandhi
Follow us

|

Updated on: Sep 28, 2022 | 6:31 PM

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక రంజుగా సాగుతోంది. ఎంపీ శశిథరూర్ ప్రత్యర్థి ఎవరన్న ఉత్కంఠ కూడా ఇంకా వీడలేదు. కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. అదే రోజు, సీనియర్ నాయకుడు ఎంపీ శశి థరూర్ కూడా (సెప్టెంబర్ 30న) నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, బుధవారం రాత్రి (సెప్టెంబర్ 28) వరకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ఢిల్లీకి రానున్నారు. గాంధీ కుటుంబం నుంచి స్పష్టమైన మద్దతు ఉన్నప్పుడే గెహ్లాట్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ వేస్తారు.

పోటీలో దిగ్విజయ్ సింగ్..

ప్రస్తుతం రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న దిగ్విజయ్ సింగ్ గురువారం సాయంత్రంలోగా తిరిగి ఢిల్లీకి చేరుకుని శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిగ్విజయ్ సింగ్‌కు గాంధీ కుటుంబం మద్దతు ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం అశోక్ గెహ్లాట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

ఇదిలావుంటే.. దిగ్విజయ్ సింగ్ గత వారమే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లుగా సూచన ప్రాయంగా తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రశ్నకు.. ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నారు. “ఎన్నికల్లో పోటీ చేసే హక్కు అందరికీ ఉంది. సెప్టెంబర్ 30 నాటికి నేను పోటీ చేస్తానో లేదో మీకే తెలుస్తుంది. అదే సమయంలో, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని చెప్పారు.”

నామినేషన్ ఫారాలను తీసుకుంది మాత్రం వీరే..

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయం గడుస్తోంది. ఇప్పటివరకు శశిథరూర్, పవన్ బన్సాల్ మాత్రమే నామినేషన్ ఫారాలను తీసుకున్నారు. రాజస్థాన్ రాజకీయ గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని.. పార్టీకి సంక్షోభం పెరిగింది. సెప్టెంబర్ 30 నామినేషన్లకు చివరి రోజు. కాంగ్రెస్ కోశాధికారి పవన్ కుమార్ బన్సాల్ కేంద్ర ఎన్నికల అథారిటీ నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. అయితే ఆయన నామినేషన్ దాఖలు చేస్తారా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. బన్సాల్ మాత్రం తాను ప్రతిపాదకుడినని.. అభ్యర్థిని కాదని అన్నారు. ఇప్పటి వరకు శశి థరూర్, పవన్ బన్సాల్ సీఈఏ నుంచి నామినేషన్ ఫారాలు తీసుకున్నారని తెలిపారు సీఈఏ అధ్యక్షుడు మధుసూదన్ మిస్త్రీ.

రాహుల్ గాంధీ ఎంపిక మాత్రం కేరళ నేతకే..

ప్రస్తుతం పార్టీ అధ్యక్ష పదవికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను హైకమాండ్ మొదటి ఎంపికగా పరిగణించినప్పటికీ, ఆట ఇంకా కొనసాగుతోంది. గురువారమే నామినేషన్ వేసేందుకు నేతలను పిలిచినట్లు కాంగ్రెస్ వర్గాలు మంగళవారం తెలిపాయి. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇంకా రేసు నుంచి బయటపడలేదు. కుమారి సెల్జా, మీరా కుమార్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. కాగా రాహుల్ గాంధీ ఎంపిక కేసీ వేణుగోపాల్.

“ప్లాన్ బి”పై ఆలోచించాలని హైకమాండ్ ఒత్తిడి 

కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. తనకు పార్టీ చీఫ్ అవ్వడం ఇష్టం లేదని తేల్చేశారు. మధ్యప్రదేశ్‌లో పార్టీ కోసం పనిచేయాలని ఉందన్నారు. రాజస్థాన్‌లో పెరుగుతున్న పొలిటికల్ డ్రామా మధ్య పార్టీ అత్యున్నత పదవికి ప్లాన్ బి గురించి ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ హైకమాండ్‌. ముందుగా అధ్యక్ష పదవిలో గెహ్లాట్‌ను కూర్చొబెట్టాలని అనుకుంది. కానీ.. ఆయన విధేయ ఎమ్మెల్యేలు మాత్రం ఆ లెక్కను మార్చేశారు.

ఢిల్లీకి అశోక్‌ గెహ్లాట్‌..

మరోవైపు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఆలిండియా కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ బరిలో నిలవడంపై సస్పెన్స్‌ వీడింది. అధ్యక్షపీఠానికి జరిగే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఢిల్లీకి రావాలని గెహ్లాట్‌కు సోనియా నుంచి పిలుపువచ్చింది. పార్టీ అధ్యక్షుడిగా నామినేషన్‌ దాఖలు చేయాలని సూచించింది సోనియా.

అయితే అశోక్‌ గెహ్లాట్‌ తీరుపై సచిన్‌ పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. సీఎం పదవిపై హైకమాండ్‌ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు ఫలితం దక్కాలని , పైలట్‌కు ఇప్పటివరకు కూడా ఆ ఫలితం దక్కలేదని నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

అధ్యక్ష పదవితోపాటు రాజస్థాన్ సీఎంగా కొనసాగాలని.. లేకుంటే తనకు సన్నిహితంగా ఉండే వ్యక్తికి కుర్చీ ఇవ్వాలని కోరుతున్నారు. తన స్థానంలో సచిన్ పైలట్‌ను సీఎం చేయడం ఆయనకు ఇష్టం లేదనే ప్రతిపాధనను కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంచారు అశోక్ గెహ్లాట్.

గెహ్లాట్ కంటే ముందే ఢిల్లీకి సచిన్ పైలట్

అశోక్ గెహ్లాట్ ఢిల్లీకి చేరుకోక ముందే హస్తినకు సచిన్ పైలట్ చేరుకున్నారు. అశోక్ గెహ్లాట్‌పై గాంధీ కుటుంబం ఆగ్రహంగా ఉందని.. అయితే ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకపోవచ్చని సచిన్ వర్గం అంటోంది. పార్టీ బాధ్యతలు అశోక్ గెహ్లాట్‌కు ఇచ్చినా సీఎం నిర్ణయాన్ని సోనియాగాంధీకి వదిలేయాలని పట్టుబడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్