పశ్చిమ బెంగాల్ లో రేపటినుంచి రెండువారాల పాటు పూర్తి లాక్ డౌన్, అత్యవసర సర్వీసులకు మినహాయింపు,

| Edited By: Phani CH

May 15, 2021 | 2:51 PM

పశ్చిమ బెంగాల్ లో రేపటి నుంచి రెండువారాల పాటు పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు బంద్ పాటిస్తాయని పేర్కొంది.

పశ్చిమ బెంగాల్ లో రేపటినుంచి రెండువారాల పాటు పూర్తి లాక్ డౌన్,  అత్యవసర సర్వీసులకు మినహాయింపు,
Complete Lockdown In Bengal
Follow us on

పశ్చిమ బెంగాల్ లో రేపటి నుంచి రెండువారాల పాటు పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు బంద్ పాటిస్తాయని పేర్కొంది. కోల్ కతా మెట్రోతో బాటు రవాణా సర్వీసులన్నీ నిలిచిపోతాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. అయితే అత్యవసర సర్వీసులను మినహాయించారు. ముఖ్య వస్తువులు, సరకులు అమ్మే షాపులను ఉదయం 7 గంటల నుంచి 10 గంటలవరకు తెరిచి ఉంచుతారు. కానీ స్వీట్ షాపులను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు తెరిచేందుకు అనుమతించారు. బ్యాంకులు, పెట్రోలు బంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు పని చేస్తాయి. పరిశ్రమలను మూసివేస్తామని, టీ గార్డెన్స్ సిబ్బంది 50 శాతం మాత్రం పని చేస్తారని ప్రభుత్వం తెలిపింది.పెళ్లిళ్లకు గెస్టులను 50 మందికి మించకుండా చూడాలని, విధిగా కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా చూడాలని కోరారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 20,846 కోవిడ్ కేసులు నమోదు కాగా-136 మంది రోగులు మృతి చెందారు. అనేక జిల్లాల్లో కేసులు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కోల్ కతా నగరంలో కేసులు అత్యధికంగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సిటీలోని వివిధ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటివరకు లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోని సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం ఇక ఈ ఆంక్షలపై దృష్టి పెట్టక తప్పలేదు. అవసరమైతే లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Trivikram Srinivas: మహేష్ సినిమాకోసం మరోఅక్కినేని హీరోను తీసుకోనున్న మాటల మాంత్రికుడు..

ONLINE TERRORISM: వేళ్ళూనుకుంటున్న ఆన్‌లైన్ టెర్రరిజమ్.. టెక్కీల సాయంతో అంతానికి అగ్రరాజ్యం స్కెచ్