Complaint on Punjab CM: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి (Punjab Chief Minister) భగవంత్ మాన్ (Bhagwant Mann) వివాదంలో చిక్కుకున్నారు. శనివారం సీఎంపై ఆ రాష్ట్ర పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. మద్యం మత్తులో భగవంత్ మాన్ గురుద్వారాలోకి ప్రవేశించారని భారతీయ జనతా పార్టీ(BJP) నేత తేజిందర్ పాల్ సింగ్ బగ్గా(Tajinder Pal Singh Bagga) శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భగవంత్ మాన్ మద్యం మత్తులో గురుద్వారాకు వెళ్లాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని బగ్గా పంజాబ్ డీజీపీని డిమాండ్ చేశారు.
ఈ నెల 14న వైశాఖి సందర్భంగా తాగిన మత్తు ఇంకా దిగకుండానే గురుద్వారాలోకి ప్రవేశించారంటూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) భగవంత్ మాన్‌పై శుక్రవారం సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఘటనకు సంబంధించి భగవంత్ మాన్ క్షమాపణ చెప్పాలని కూడా ఎస్జీపీసీ డిమాండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి మాన్‌పై కేసు నమోదు చేయాలంటూ బగ్గా నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. అదే సమయంలో, SGPC సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రఘుజిత్ సింగ్ విర్క్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మద్యం మత్తులో పవిత్ర స్థలాన్ని సందర్శించారని మరియు సిక్కు ‘రెహత్ మర్యాద’ (ప్రవర్తనా నియమావళి)ని ఉల్లంఘించారని అన్నారు. రాజ్యాంగ పదవికి ప్రతిష్ట. సిక్కు సమాజానికి సీఎం మాన్ క్షమాపణ చెప్పాలని విర్క్ అన్నారు.
Punjab News
SPGC has accused Bhagwant Mann of entering Takht Damdama Sahib in inebriated state. They have asked him to issue an apology for this misbehaviour.
— News Arena (@NewsArenaIndia) April 16, 2022
కాగా.. పంజాబ్‌లో భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి శనివారంతో నెల రోజులు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ప్రకటించింది. జులై 1 నుంచి ఈ ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు పంజాబ్ సమాచార పౌరసంబంధాల శాఖ తెలిపింది.
2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఉచిత విద్యుత్ వాగ్దానం చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు దీనిని అమలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇదే విషయంలో గత మంగళవారం సీఎం భగవంత్ మాన్ మాట్లాడారు. తమ ప్రభుత్వం త్వరలో రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పబోతోందని అన్నారు. ఇటీవలే AAP అధికార ప్రతినిధి మల్విందర్ సింగ్ కాంగ్ కూడా పంజాబ్‌లో ఉచిత విద్యుత్ సరఫరా ప్రకటన త్వరలో రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. చండీగఢ్‌లో మీడియాతో మాట్లాడిన మల్విందర్ కాంగ్.. ప్రజలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి పంజాబ్ ప్రభుత్వం బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తోందని అన్నారు. అది దాదాపుగా పూర్తి కావొస్తోందని, ఈ విషయంలో త్వరలోనే ప్రకటన వెలువడుతుందని చెప్పారు.
ఇదిలా ఉండగా పంజాబ్ రాష్ట్రంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 10 ఎకరాలు, అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులపై ‘‘ట్యూబ్‌వెల్ బిల్లులు’’ విధించనున్నట్లు తనకు తెలిసిందని భోలాత్‌లోని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే సుఖపాల్ సింగ్ ఖైరా శుక్రవారం ఆరోపించారు. ఈ మేరకు ట్విట్లర్ లో పోస్ట్ చేశారు. “భగవంత్‌మాన్ ప్రభుత్వం క్రాస్ సబ్సిడీ చేయడానికి కొంటెగా వెళుతోందని నేను తెలుసుకున్నాను! వారు 10 ఎకరాలు, అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకు ట్యూబ్‌వెల్ బిల్లులు విధించనున్నారు. అలా పొదుపు చేసి అందులో నుంచి 300 యూనిట్లు ఉచితంగా ఇస్తారు ! ఈ ఉచిత విద్యుత్ హామీ ఇస్తున్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ మోసాన్ని చెప్పలేదు ! ’’ అని ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం వ్యవసాయ రంగానికి పంజాబ్ రాష్ట్రం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది.
Read Also… Visakha Politics: విశాఖలో మంత్రివర్గ విస్తరణ తెచ్చిన తంటా.. అమర్-అవంతి మధ్య భగ్గుమన్న వర్గ విబేధాలు