BIS Recruitment 2022: డిగ్రీ అర్హతతో.. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌లో 348 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ (BIS).. అసిస్టెంట్‌ డైరెక్టర్‌, పర్సనల్‌ అసిస్టెంట్‌ (Assistant Director Posts) తదితర పోస్టుల భర్తీకి..

BIS Recruitment 2022: డిగ్రీ అర్హతతో.. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌లో 348 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..
Bis
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 16, 2022 | 5:20 PM

Bureau of Indian Standards Director Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ (BIS).. అసిస్టెంట్‌ డైరెక్టర్‌, పర్సనల్‌ అసిస్టెంట్‌ (Assistant Director Posts) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 348

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ డైరెక్టర్‌, పర్సనల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ సెక్షన్ ఆఫీసర్‌, అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్‌, సీనియర్‌ సెక్రటేరియట్ అసిస్టెంట్‌, హార్టికల్చర్‌ సూపర్‌వైజర్‌, టెక్నికల్ అసిస్టెంట్‌, సీనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులు

విభాగాలు: మెకానికల్‌, కెమికల్‌, మైక్రోబయోలజీ, కార్పెంటర్‌, వెల్డర్‌, ప్లండర్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

అర్హతలు:

  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి మాస్టర్స్‌ డిగ్రీ/ పీజీ/ ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కనీసం 3 నుంచి 5 ఏళ్ల పని అనుభవం కూడా ఉండాలి.
  • పర్సనల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • అసిస్టెంట్ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • అసిస్టెంట్ పోస్టులకు బ్యాచిలర్స్‌ డిగ్రీ/ డిప్లొమా ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • హార్టికల్చర్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బ్యాచిలర్స్‌ డిగ్రీ/ డిప్లొమా ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత.
  • సీనియర్‌ టెక్నీషియన్ పోస్టులకు మెట్రిక్యులేషణ్/ ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టును బట్టి ఆన్‌లైన్‌ పరీక్ష/స్కిల్‌టెస్ట్‌/ప్రాక్టికల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

TS Govt Jobs 2022: ఈ నెలఖరులోగా తెలంగాణలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు షురూ! పూర్తి వివరాలు..