దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్

ఢిల్లీ లోను, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరిందని  తాను భావిస్తున్నట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్రం ఇప్పటికే అంగీకరించి ఉండాల్సిందన్నారు. శనివారం మీడియాతో..

దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 19, 2020 | 4:57 PM

ఢిల్లీ లోను, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరిందని  తాను భావిస్తున్నట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్రం ఇప్పటికే అంగీకరించి ఉండాల్సిందన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన..,  అయితే ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్  మెడికల్ రీసర్చ్ ధృవీకరించాలని  చెప్పారు. అమెరికా తరువాత ఇండియా కరోనా వైరస్ కేసుల విషయంలో రెండో స్థానానికి చేరడం  దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. అయితే నగరంలో టెస్టుల సంఖ్యను పెంచామని, కేసులు రెట్టింపు కావడానికి విరామం 40 రోజులకు పెరిగిందని జైన్ పేర్కొన్నారు.

కాగా-ఢిల్లీలో శుక్రవారం ఒక్కరోజే 4,127 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2.38 లక్షలకు పెరిగింది. గత 24 గంటల్లో 38 మంది కరోనా రోగులు మృతి చెందారు.