రద్దీగా ఉండే మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. ఆక్వేరియం షాపులో చెలరేగిన మంటలు.. మరో మూడు ఇళ్లకు..!

|

Feb 10, 2023 | 6:39 PM

అగ్నిప్రమాదం సంభవించిన అక్వేరియం దుకాణం పూర్తిగా దగ్ధమైందని పోలీసులు తెలిపారు. భవనానికి వెళ్లే మార్గం ఇరుకైనందున అగ్నిమాపక యంత్రం లోపలికి వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది.

రద్దీగా ఉండే మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. ఆక్వేరియం షాపులో చెలరేగిన మంటలు.. మరో మూడు ఇళ్లకు..!
Fire Accident
Follow us on

గత కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. చిన్నపాటి తప్పిదాలు, షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలకు భారీ నష్టం మిగులోంది. తాజాగా కేరళ రాజధాని నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే వజుతచౌడ్‌లోని వాణిజ్య భవనంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు. అగ్నిప్రమాదం సంభవించిన అక్వేరియం దుకాణం పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. ఇక్కడి ఎంపీ అప్పన్ రోడ్డులో ఉన్న భవనం నుంచి దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ప్రమాదం తీవ్రత పెరగకుండా, ఇతర నిర్మాణాలు, ఇళ్లకు మంటలు వ్యాపించకుండా చూసేందుకు, సమీపంలోని ఇళ్లు, ఇతర భవనాల నుండి ప్రజలను ఖాళీ చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే, తిరువనంతపురంలో జరిగిన అగ్నిప్రమాదంపై మంత్రి ఆంథోని కె రాజు జిల్లా కలెక్టర్‌ను సమగ్ర నివేదిక కోరారు. వెల్డింగ్ సమయంలో మంటలు చెలరేగి ఉండవచ్చని ఆంటోని రాజు తెలిపారు. వషుతక్కటే అక్వేరియం గోడౌన్ అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. రెండంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. భవనంపై నుంచి మూడు ఇళ్లకు మంటలు వ్యాపించాయి. పాత ఆప్టికల్ కేబుల్స్‌తో మంటలు చెలరేగాయి. భవనానికి వెళ్లే మార్గం ఇరుకైనందున అగ్నిమాపక యంత్రం లోపలికి వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. అతి కష్టం మీద సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చింది.

అగ్నిప్రమాదం సంభవించిన అక్వేరియం దుకాణం పూర్తిగా దగ్ధమైందని తెలిసింది. ప్రమాదంలో జరిగిన ఆస్తినష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..