Trending: డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది.. దోపిడీకి వెళ్తే ఊహించని సీన్ కు విలవిల్లాడిపోయారు..
నేరాలను అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎన్న చర్యలు తీసుకుంటున్నా అవి.. నేరగాళ్లలో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోతున్నాయి. పట్టపగలు, నడిరాత్రి అని కూడా చూడకుండా నేరాలకు...
నేరాలను అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవి.. నేరగాళ్లలో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోతున్నాయి. పట్టపగలు, నడిరాత్రి అని కూడా చూడకుండా నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో అలాంటి ఘటనే జరిగింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ భికన్‌గావ్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఓ బ్యాంకులో ఇద్దరు వ్యక్తులు.. బురఖా ధరించి లోపలకు వెళ్లారు. తాము బ్యాంకు పని కోసం వచ్చామని అక్కడున్న సిబ్బందిని మాటల్లో పెట్టారు. కొంత సమయం తర్వాత.. ఓ వ్యక్తి తమ వెంట తెచ్చుకున్న పిస్టోల్ తీసి.. సిబ్బందిని బెదిరించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో షాక్ అయిన బ్యాంక్ సిబ్బంది.. వెంటనే తేరుకున్నారు. వారి దగ్గర ఉన్న పిస్టోల్ ను లాక్కున్నారు. ఇద్దరిలో ఒకరిని మాత్రమే పట్టుకున్నారు. మరొకరు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. పట్టుకున్న వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. వారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. రెండో వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా.. గత నెలలో బిహార్‌లోని వైశాలిలోని ఓ బ్యాంకులో కాపలాగా ఉన్న ఇద్దరు మహిళా పోలీసు కానిస్టేబుళ్లు దోపిడీ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో, మహిళా పోలీసులు – జూహి కుమారి, శాంతి కుమార్ – ముగ్గురు సాయుధ దొంగలు బ్యాంకులోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆపడం చూడవచ్చు. అయితే వీరిలో ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దుండగులు మాత్రం అక్కడి నుంచి తప్పించుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం