Semi Bullet Trains: త్వరలో సెమీ బుల్లెట్‌ రైళ్ల కూత.. ప్రత్యేక బోగీలు, ఆధునిక హంగులు..ప్రయోగాత్మక పరీక్షలు

|

Mar 03, 2021 | 4:09 AM

Semi Bullet Trains: ఒక వైపు బుల్లెట్‌ రైళ్ల కోసం ప్రాజెక్టులు సిద్దమవుతుండగా, మరో వైపు సెమీ బుల్లెట్‌ రైళ్ల ప్రయోగాలు కూడా మొదలయ్యాయి.  భారతీయ రైల్వే ఇటీవల 180 కిలోమీటర్ల.

Semi Bullet Trains: త్వరలో సెమీ బుల్లెట్‌ రైళ్ల కూత.. ప్రత్యేక బోగీలు, ఆధునిక హంగులు..ప్రయోగాత్మక పరీక్షలు
Follow us on

Semi Bullet Trains: ఒక వైపు బుల్లెట్‌ రైళ్ల కోసం ప్రాజెక్టులు సిద్దమవుతుండగా, మరో వైపు సెమీ బుల్లెట్‌ రైళ్ల ప్రయోగాలు కూడా మొదలయ్యాయి.  భారతీయ రైల్వే ఇటీవల 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సెమీ బుల్లెట్‌ రైలును పరీక్షించినట్టు తెలిపింది. ఏసీ-3టైర్‌ బోగీలతో నడిచే ఈ రైలును ప్రయోగాత్మకంగా కోటా-సవాయ్‌ మాధోపూర్‌ మధ్య నడిపినట్టు పేర్కొంది. ఈ ప్రయోగాత్మకంలో మంచి ఫలితాలే వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. అయితే కపుర్తలలోని రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ (ఆర్సీఎఫ్‌)లో తయారైన ఏసీ-3టైర్‌ బోగీలను రిసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌(ఆర్డీఎస్వో) కొద్దిరోజులుగా పరీక్షలు జరుపుతోంది. తమ ప్రయోగాలు పూర్తయ్యాయని, త్వరలోనే ఒక నివేదికను రూపొందించి పంపుతామని ఆర్డీఎస్వో పీఆర్వీ వెల్లడించారు. ఈ బోగీలకు అన్నిరకాల అనుమతులు వచ్చిన వెంటనే భారీ స్థాయిలో వాటి ఉత్పత్తిని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సాధారణంగా ఏసీ-3టైర్‌ బోగీలలో 72 బెర్త్‌లు ఉంటాయి.

ప్రత్యేక బోగీలు, ఆధునిక హంగులు..

కాగా,ఈ ప్రత్యేక బోగీలో 83 బెర్త్‌లు ఉండే విధంగా ఆధునిక హంగులతో రూపొందించినట్టు అధికారులు పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలోగా 248 బోగీలను సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మెయిళ్లు/ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఈ బోగీలను జతచేయనున్నట్టు తెలుస్తున్నది. నాన్‌ ఏసీ కోచ్‌లతో నడిచే రైళ్లు 110 కిలోమీటర్ల వేగాన్ని అధిగమించలేవని రైల్వే వర్గాలు తెలుపుతున్నాయి. ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, సెమీ బుల్లెట్‌ రైళ్లకు మాత్రమే ఈ కొత్త బోగీలు ఉపయోగపడతాయని పేర్కొన్నాయి. ఈ కొత్త కోచ్‌లలో యూఎస్బీ పాయింట్లు, రీడింగ్‌ లైట్లు, ప్రత్యేకమైన ఏసీ, వికలాంగులు సులభంగా ప్రవేశించగల ద్వారాలు తదితర సౌకర్యాలుంటాయని అధికారులు తెలిపారు. అనుమతులు వచ్చిన వెంటనే సెమీ బుల్లెట్‌ రైళ్లను పట్టాలెక్కించనున్నారు. ఈ రైలును అన్ని అత్యధునిక టెక్నాలజీ సాయంతో తయారైనట్లు అధికారులు అంటున్నారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే ఎంతో మేలని అంటున్నారు. అయితే ఈ ట్రైను ఇటీవల జరిపిన ప్రయోగం కూడా విజయవంతమైందని అధికారులు అంటున్నారు. ఈ రైళ్లను సరికొత్తగా డిజైన్‌ చేయనున్నారు. అందులో అన్ని విధాల సౌకర్యాలు ఉండనున్నాయి. మామూలు ఎక్స్‌ప్రెస్‌లో ఉండేకంటే ఈ రైళ్లలో అనేక సదుపాయాలున్నాయి. చాలా వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ రైలుకు.

ఆ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ ఫాం టికెట్‌ ధర రూ.50.. కరోనా కట్టడి కోసమే ఈ నిర్ణయం అంటున్న రైల్వే అధికారులు