Gold Smuggling: రూ.20 కోట్లు విలువైన 32 కిలోల భారీ బంగారం స్వాధీనం.. ఎక్కడంటే

|

Jun 01, 2023 | 7:22 PM

ఇటీవల విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలించే ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలోని వివిధ విమానశ్రయాల్లో బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులకు పట్టుబడటం లాంటివి చోటుచేసుకోవడం మాములైపోయింది.

Gold Smuggling: రూ.20 కోట్లు విలువైన 32 కిలోల భారీ బంగారం స్వాధీనం.. ఎక్కడంటే
Gold Smuggling
Follow us on

ఇటీవల విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలించే ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలోని వివిధ విమానశ్రయాల్లో బంగారం తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులకు పట్టుబడటం లాంటివి చోటుచేసుకోవడం మాములైపోయింది. ముంబయి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కొల్‌కత్తా లాంటి మహానగరాల్లో ఇలాంటివి ఘటనలు పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా తమిళనాడులోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ తీరం వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డీఆర్‍‌ఐ, భారత తీర గస్తీ దళం అధికారులు పట్టుకున్నారు.

నిందితుల నుంచి రూ.20 కోట్లు విలువ చేసే 32.7 కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక మీదుగా భారత్‌కు ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. జాలర్ల బోట్లలో స్మగ్లర్లు భారీగా బంగారం తరలిస్తున్నారనే సమాచారం అందిందని తెలిపారు. అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపోలోకి తీసుకున్నామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..