Coal Crisis: బొగ్గు కొరతను అధిగమించేందుకు చర్యలు.. రాష్ట్రాల జెన్‌కో అధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి

|

May 06, 2022 | 6:55 PM

Coal Crisis: దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా కొనసాగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతోన్న వేళ దేశవ్యాప్తంగా..

Coal Crisis: బొగ్గు కొరతను అధిగమించేందుకు చర్యలు.. రాష్ట్రాల జెన్‌కో అధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి
Follow us on

Coal Crisis: దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా కొనసాగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతోన్న వేళ దేశవ్యాప్తంగా విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో కరెంటు ఉత్పత్తిని పెంచేందుకు ఆయా రాష్ట్రాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, బొగ్గు కొరతతో.. విద్యుత్తు కోతలు తప్పడం లేదు. ముఖ్యంగా ఢిల్లీ, రాజస్థాన్‌, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, తదితర రాష్ట్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులోనూ ఈ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు.. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లద్‌ జోషి (Pralhad Joshi) రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జెన్‌కో అధికారులతో సమావేశం నిర్వహించారు. స్టాక్‌ హోల్డర్ల మధ్య మెరుగైన సమన్వయం ఉంటే బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచి థర్మల్‌ పవర్‌ ప్లాంట్లకు నేరుగా పంపించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తిని పెంచి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లకు పంపించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను నెరవేర్చడానికి భారతదేశం బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రిక్‌ వాహనాల పెరుగుదల, పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌ కారణంగా 2040 నాటికి బొగ్గు అవసరం రెండింతలు కానుందని అన్నారు. అందుకే ఈ సమస్యను అధిమించేందుకు బొగ్గు ఉత్పత్తిని పెంచాలని అన్నారు. విద్యుత్‌ డిమాండ్‌ దాదాపు 20 శాతం పెరిగినందున బొగ్గును దిగుమతి చేసుకునే అన్ని ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పని చేయాలని ఆదేశించారు. విద్యుత్‌ సంక్షోభంలో ఉన్నందున దేశీయ బొగ్గుపై ఆధారపడిన అన్ని రాష్ట్రాలు బొగ్గులో కనీసం10 శాతం దిగుమతి చేసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఈ ఏడాది ముందుగానే వడ్డీ జమ.. ఎప్పుడంటే..!

Mother’s Day Offer: ‘మాతృ దినోత్సవం కోసం ప్రత్యేక ఆఫర్‌.. రూ.1999 షాపింగ్ చేయండి.. రూ.500 తగ్గింపు పొందండి