UP CM Yogi: సీఎం యోగిని చంపుతామని బెదిరింపు.. కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ గుర్తింపు

|

Aug 21, 2022 | 7:20 AM

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని బెదిరించిన ఉదంతాలు తరచూ తెరపైకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సీఎం యోగిని చంపేస్తానని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదైంది

UP CM Yogi: సీఎం యోగిని చంపుతామని బెదిరింపు.. కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ గుర్తింపు
Cm Yogi
Follow us on

UP CM Yogi: సోషల్ మీడియాను(Social Media) కొంతమంది దుండగులు దుర్వినియోగం చేస్తున్నారు.. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి.. తమ ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తున్నారని గత కొంతకాలంగా ఆందోళనా వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల నరికి చంపుతామని ఫేక్ ఫేస్ బుక్ ఖాతాను ఉపయోగించినట్లు బెదిరించినట్లు పోలీసుల దర్యాప్తులో  వెలుగులోకి వచ్చింది. మొరాదాబాద్ పోలీసుల పేరుతో నకిలీ పేజీని సృష్టించారు. ఈ ఫేస్‌బుక్‌ పేజీకి రెపరెపలాడుతున్న పాకిస్థాన్ జెండాను డీపీగా పెట్టుకున్నారు. ఈ పేజీద్వారా.. ఆత్మ ప్రకాష్ పండిట్ అనే ఖాతాతో సీఎం యోగిని చంపేస్తామంటూ బెదిరించారు.

ఈ విషయమై మొరాదాబాద్ ఎస్పీ అఖిలేష్ బదురియా మాట్లాడుతూ.. సీఎం యోగికి బెదిరింపుల నేపథ్యంలో.. సైబర్ సెల్ విచారణ చేపట్టిందని చెప్పారు. ఆత్మ ప్రకాష్ అనే వ్యక్తి తనకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందని, దానిని దుర్వినియోగం చేసి సంఘవిద్రోహ విషయాలను పోస్ట్ చేస్తున్నారని చెప్పాడని మొరాదాబాద్ ఎస్పీ అఖిలేష్ భదరియా తెలిపారు. అయితే ఆత్మ ప్రకాష్ వాదనపై విచారణ జరుగుతోందన్నారు. మొరాదాబాద్ పోలీసుల పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ పేజీ క్రియేట్ చేసి, దాని ద్వారానే ఇలాంటి పోస్టులు చేస్తున్నట్లు సమాచారం. ఆత్మప్రకాష్ పండిట్ అనే ఖాతా నుంచి ఈ పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై దర్యాప్తు సాగుతుందన్నారు.

ఇవి కూడా చదవండి

వాట్సాప్ ద్వారా బెదిరింపు:
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని బెదిరించిన ఉదంతాలు తరచూ తెరపైకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సీఎం యోగిని చంపేస్తానని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మూడు రోజుల్లో బాంబుతో పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. షాహిద్ అనే వ్యక్తి పేరుతో నమోదైన నంబర్ నుండి డయల్ 112 సర్వీస్ వాట్సాప్ నంబర్‌కు ఆగస్టు 2న మెసేజ్ వచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో హెడ్‌క్వార్టర్ సెంటర్ కమాండర్ సుభాష్ కుమార్ ఫిర్యాదు మేరకు లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని వర్గాలు తెలిపాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..