‘మా అబ్బాయిని మంత్రిని చేద్దామనుకుంటున్నా.. దయచేసి అనుమతించండి’ అంటూ సీఎం స్టాలిన్ పెట్టుకున్న దరఖాస్తును ఓకే చేసింది చెన్నయ్ రాజ్‌భవన్. ఇవాళే ప్రమాణ స్వీకారం.. పట్టాభిషేకానికి ముహూర్తం ఉదయం 9 గంటలు.. దీపిరి తమిళనాడు రాజ్‌భవన్ దర్బార్ హాల్ వేదిక కానుంది. బంధుప్రీతిని.. వారసత్వాన్ని ఎగదోస్తున్నారు.. ఇదేమైనా రాజరికం అనుకున్నారా అంటూ అపోజిషన్ పార్టీలు రంకెలేస్తుంటే.. రూలింగ్ డీఎంకే క్యాడర్ మాత్రం నవ శకానికి వెల్‌కమ్ చెబుతోంది.
మొత్తానికి సన్ రైజింగ్ ఇన్ డీఎంకే.. అనేది హాట్‌టాపిక్ ఇన్ తమిళనాడు. అలాగని ఉదయానిధి స్టాలిన్‌కి పాలిటిక్స్ కొత్తేమీ కాదు. సినిమాల్లో హీరోగా చేస్తూనే రీసెంట్ ఎలక్షన్స్‌లో చురుగ్గా క్యాంపెయిన్ చేసి.. ప్రిన్స్ ఆఫ్ డీఎంకే అనిపించుకున్నారు. నెక్ట్స్ జెనరేషన్ పొలిటీషియన్‌గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇప్పుడు నాన్న క్యాబినెట్‌లో కుర్చీ వేసుకుని కూర్చోబోతున్నారు. ఇంతకీ స్టాలిన్ మంత్రాంగంలో ఉదయానిధికి దక్కబోయే పోర్ట్‌ఫోలియో ఏంటి? ఏ శాఖ అయితే చిన్నరాజా వారికి సూపర్‌గా సూటవ్వుద్ది?
కొడుకు ఉదయానిధికివ్వాల్సిన మంత్రిత్వ శాఖ మీద నాన్న స్టాలిన్ ఏం ఆలోచించారు.. ఆయన మనసులో ఏముంది అనేది ఇప్పటికైతే ఒక మెగా సస్పెన్స్. ఉదయానిధి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే. చెపాక్ నియోజకవర్గంలో గెలిచి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే.. అధ్యక్షా అంటూ ఉపన్యాసాలు కూడా దంచిపారేశారు. మంత్రిగా ఏ శాఖనిచ్చినా చెలాయించుకొస్తారనే కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ ఐపోయింది. ఐతేగియితే ఐటీ మంత్రే అవుతారనేది డీఎంకే వర్గాలు చేస్తున్న ఒకానొక గెస్ వర్క్.
దక్షిణాదిలో..
ఇదే గనుక జరిగితే సౌత్ ఇండియాలో ఉదయానిధికి ఒక బిగ్ ఛాలెంజ్ వెయిటింగ్‌లో ఉంది. ఇద్దరు యంగ్ టర్క్స్‌తో పోటీకి సిద్ధం కాక తప్పదు స్టాలిన్ తనయుడికి. ఎందుకంటే.. తండ్రులు అధికారంలో ఉండగానే రాజకీయ వారసత్వం తీసుకున్న యువనేతలుగా నారా లోకేష్, కల్వకుంట్ల తారక్.. ఇద్దరూ ఇప్పటికే దక్షిణాది రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఉదయానిధీ అంతే. నాన్న చెప్పుల్లో కాళ్లు పెట్టి.. క్యాబినెట్‌లో ప్లేస్‌మెంట్ తీసుకున్నారు.
మంత్రి కేటీఆర్.. నారా లోకేష్..
ఇక్కడే మరో గమ్మత్తయిన పోలికుంది. 2014-19 చంద్రబాబు గవర్నమెంట్‌లో ఐటీ మంత్రిగా చేశారు తనయుడు నారా లోకేష్. ఐటీ కంపెనీల్ని ఏపీకి రప్పించడానికి దేశదేశాలు పర్యటించారు. తన హయాంలో ఏపీలో ఏకంగా ఎనిమిది ఐ.టి కంపెనీలకు రిబ్బన్ కటింగ్ చేశారు లోకేష్. ఇక తెలంగాణాలో బీఆర్‌ఎస్ యువరాజు కేటీఆర్ ఐటీ శకమైతే ఇప్పటికీ కంటిన్యూ ఔతూనే ఉంది.
హైదరాబాద్‌లో ఐటీ హబ్ నిర్మాణంతో మొదలుపెడితే.. ఐటీ మంత్రిగా కేటీఆర్ జర్నీ అండర్‌లైన్ చేసుకోదగ్గదే. హైటెక్ నగరం హైదరాబాద్‌ని ఐటీ రంగంలో మేటిగా తీర్చి దిద్దుతున్నారు. వీటన్నిటికీ మించి.. ఐటీ మినిస్టర్‌గా గ్లోబల్ ఎకనమిక్ సమిట్‌ని హోస్ట్ చేసి.. స్కిల్ మాంగే మోర్ అనిపించుకున్నారు. ఇవాంకా ట్రంప్‌తో కేటీఆర్ మాటామంతీ అప్పట్లో ఒక సెన్సేషన్.
ఇప్పుడు తమిళనాట ఉదయానిధి కూడా ఐటీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. 3 రాష్ట్రాల్లో వారసులకు ఐటీ శాఖ దక్కడం ఒక రిమార్కబుల్ పాయింట్ అవుతుంది. హైదరాబాద్, చెన్నయ్ రెండు నగరాలూ ఆల్రెడీ ఐటీ సిటీస్‌గా పోటీ పడుతున్నాయి. రేపటిరోజున హైదరాబాద్ వర్సెస్ చెన్నయ్ కాస్తా.. కేటీఆర్ వర్సెస్ ఉదయానిధిగా మారినా మారొచ్చు. ఇప్పటికే మేటి ఐటీ సిటీగా ఎదిగిన బెంగళూరు.. బెంగళూరుకు గట్టి పోటీ ఇస్తున్న హైదరాబాద్.. ఇదే రేసులో ఇక చెన్నయ్. మరి.. ఈ చిన్నరాజా వారు ఆ బిగ్ టార్గెట్‌కి రెడీ కావాల్సిందేనా? ముగ్గురు యువ ఐటీ మంత్రుల వరుసలో ఉదయానిధి ప్లేస్ ఏది కాబోతోంది.? సౌత్‌లో ఇదొక ఇంట్రస్టింగ్ ఫైట్ సీను.
మరిన్ని జాతీయ వార్తల కోసం..