ఢిల్లీలో కొనసాగుతున్న తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన.. ప్రధాని మోదీ, రాహుల్‌తో భేటీ
పాతికేళ్ల టార్గెట్.. ఫ్యూచర్‌కు రోడ్ మ్యాప్. తెలంగాణ రైజింగ్ 2047 అంటే.. రాష్ట్ర భవిష్యత్తుకే విజన్ డాక్యుమెంట్ అంటోంది రేవంత్ సర్కార్. రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అయ్యేలా పక్కా ప్రణాళికలు రచిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వ. అతి త్వరలోనే జరగబోయే గ్లోబల్ సమ్మిట్.. గ్రాండ్‌గా జరగాలి. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్ప దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా అతిరథ మహారథులను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నారు.

పాతికేళ్ల టార్గెట్.. ఫ్యూచర్‌కు రోడ్ మ్యాప్. తెలంగాణ రైజింగ్ 2047 అంటే.. రాష్ట్ర భవిష్యత్తుకే విజన్ డాక్యుమెంట్ అంటోంది రేవంత్ సర్కార్. రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతం అయ్యేలా పక్కా ప్రణాళికలు రచిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వ. అతి త్వరలోనే జరగబోయే గ్లోబల్ సమ్మిట్.. గ్రాండ్‌గా జరగాలి. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్ప దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా అతిరథ మహారథులను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పర్యటన చేపట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు రావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. పార్లమెంట్లో ప్రధానితో జరిగిన ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ప్రధానికి అందించారు ముఖ్యమంత్రి రేవంత్.
కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని సీఎం ప్రధానికి వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు. నీతి అయోగ్ సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్నట్లు సీఎం ప్రధానికి వివరించారు.
తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహాకారాలు అందించాలని సీఎం ప్రధానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు తగిన అనుమతులు ఇవ్వాలని కోరారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసింది. రూ.43,848 వేల కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టేందుకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలని, దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదనల్లో ఉన్న రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును వీలైనంత తొందరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగుళూరు హై స్పీడ్ కారిడార్ ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చోరవ చూపాలని సీఎం రేవంత్ కోరారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఫోర్ లేన్ ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని సీఎం ప్రధానికి వినతిపత్రం అందించారు.
Hon’ble Chief Minister Shri @revanth_anumula extended a special invitation to the Hon’ble Prime Minister Shri @narendramodi ji to grace the Telangana Rising Global Summit at Bharat Future City, Hyderabad, with his esteemed presence in this landmark initiative, showcasing… https://t.co/3ogeFyfG3B pic.twitter.com/QNgmdLl8z8
— Telangana CMO (@TelanganaCMO) December 3, 2025
తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కూడా కలసి గ్లోబల్ సమ్మిట్‌కి ఆహ్వానించారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అశ్విన్ వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసిన ముఖ్యమంత్రి ఇన్విటేషన్ అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి దృక్పథం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడి అవకాశాలతోపాటు తెలంగాణ రైజింగ్– 2047 రోడ్‌మ్యాప్‌ను ప్రదర్శించడానికి ప్రధాన వేదికగా గ్లోబల్ సమ్మిట్ నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
మంగళారం కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఇవాళ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను కలిసి అహ్వానించారు. అంతేకాకుండా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా సమ్మిట్‌కి ఆహ్వానిస్తోంది తెలంగాణ సర్కార్. ఇందుకోసం మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్తున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అంతర్జాతీయ కంపెనీలు సమ్మిట్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Hon’ble Chief Minister Shri @revanth_anumula met Lok Sabha Leader of Opposition Shri @RahulGandhi and MP Smt @priyankagandhi in New Delhi today.
The leaders, sharing a common vision for Telangana’s growth, were briefed on the #TelanganaRisingGlobalSummit and the… pic.twitter.com/iduuVEP42V
— Telangana CMO (@TelanganaCMO) December 3, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
