ట్రంప్‌‌ను కలవనున్న కేసీఆర్.. ఇవాంకాకు అదిరిపోయే గిఫ్ట్

ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సీఎం కేసీఆర్ భేటీ కాబోతున్నారు. అలాగే ఆయన కూతురు ఇవాంకాకు అదిరిపోయే గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నట్లు..

ట్రంప్‌‌ను కలవనున్న కేసీఆర్.. ఇవాంకాకు అదిరిపోయే గిఫ్ట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 25, 2020 | 7:40 AM

ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సీఎం కేసీఆర్ కలవబోతున్నారు. అలాగే ఆయన కూతురు ఇవాంకాకు అదిరిపోయే గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈరోజు ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్ పర్యటన గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సాయంత్రం రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 90 నుంచి 95 మంది వీఐపీలు పాల్గొననున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరయ్యే విందుకు రాష్ట్రపతి భవన్.. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించింది. ఈ జాబితాలో రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా ఉన్నారు.

కాగా.. ట్రంప్‌కి రాష్ట్రపతి కోవింద్ ఇచ్చే విందులో తెలంగాణ వంటకాలు కూడా ఉండనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ట్రంప్‌కు ఫిలిగ్రి చార్మినార్ ప్రతిమతో కూడిన జ్ఞాపికను, పోచంపల్లి శాలువాను కేసీఆర్ అందజేయనున్నారు. అలాగే.. ట్రంప్ భార్య మెలనియా, కుమార్తె ఇవాంకాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి పోచంపల్లి, గద్వాల పట్టుచీరలను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఇవాంక ఓ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌‌లో పర్యటించారు. అప్పుడు గోల్కొండ ఫోర్ట్‌ను సందర్శించారు.