విమాన ప్రమాదాలపై దర్యాప్తుకు ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ.. ఎవరెవరున్నారు, వారు ఏం చేస్తారు?

ఏదైనా ప్రమాదం, తప్పు, సంఘటన జరిగితేనే దానిపై ఎవరైనా దృష్టి పెడతారు. ఇప్పుడు అదే జరిగింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా AI 171 బోయింగ్ విమాన ప్రమాదంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మేల్కొంది. విమాన ప్రమాదం ఏ విధంగా జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని అంశంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృతంలో ఈ కమిటీ పనిచేయనుంది.

విమాన ప్రమాదాలపై దర్యాప్తుకు ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ.. ఎవరెవరున్నారు, వారు ఏం చేస్తారు?
Ahmedabad Plane Crash

Edited By: Anand T

Updated on: Jun 14, 2025 | 9:54 AM

అయితే, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఏ విధంగా జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృతంలో పనిచేసే కమిటీలో అనేక విభాగాలకు సంబంధించిన ఉన్నతాధికారులను నియమించింది. విమాన ప్రమాదం ఏ విధంగా జరిగింది. తదుపరి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై మూడు నెలల్లో సమగ్ర నివేదికను మంత్రుల శాఖకు అందజేయాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.

ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అంచనా వేయడంతో పాటు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు (SOPలు), భద్రతా మార్గదర్శకాలను కమిటి సమీక్షించనుంది. భవిష్యత్తులో విమాన ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలను రూపొందించడంపై కమిటీ దృష్టి పెడుతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. మూడు నెలల్లో కమిటి తన నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పిస్తుంది. ఈ కమిటీ సంబంధిత సంస్థలు నిర్వహించే ఇతర విచారణలకు ప్రత్యామ్నాయంగా ఉండదు. ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేస్తుందని సంబంధిత అధికారులు నిర్వహిస్తున్న ఇతర చట్టబద్ధమైన లేదా సాంకేతిక దర్యాప్తులతో సంబంధం ఉండదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

కమిటీలో ఉండే సభ్యులు ఎవరెవరూ..

విమాన ప్రమాదాలపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ కేంద్ర హోం కార్యదర్శి (చైర్మన్), పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి, గుజరాత్ ప్రభుత్వ హోం శాఖ ప్రతినిధి, గుజరాత్ ప్రభుత్వ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన అథారిటీ ప్రతినిధి అహ్మదాబాద్ పోలీస్ కమీషనర్, భారత వైమానిక దళ తనిఖీ భద్రతా డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ జనరల్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, డిజి బిసిఎఎస్, ఐబీ ప్రత్యేక డైరెక్టర్, డైరెక్టర్ జనరల్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డిజి డిజిసిఎ, డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్ వంటి అధికారులు ఉన్నారు. కమిటీకి తగిన వారని భావించే ఏ ఇతర సభ్యుడిని, విమానయాన నిపుణులు, ప్రమాద పరిశోధకులు న్యాయ సలహాదారులను కూడా తదుపరి కమిటీ చేర్చుకునే అవకాశం

కమిటీకి ఉన్న అధికారాలు..

ఈ కమిటీ విమాన డేటా, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లు, విమాన నిర్వహణ రికార్డులు, ATC లాగ్, సాక్షుల సాక్ష్యాలతో సహా అన్ని రికార్డులను యాక్సెస్ చేయగలదు.ప్రమాద సైట్ తనిఖీలు నిర్వహిస్తుంది..సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, సంబంధిత సిబ్బంది వాంగ్మూలాలు సేకరిస్తుంది విదేశీ పౌరులు, విమాన తయారీదారులు, అంతర్జాతీయ సంస్థలకు సహకరిస్తుంది.

కేంద్ర హోం కార్యదర్శి నేతృత్వం పనిచేయనున్న కమిటీ..

విమాన ప్రమాదాలు భద్రతా చర్యలపై చేసిన కమిటీ కేంద్ర హోం కార్యదర్శి నేతృత్వంలో పనిచేయనుంది. కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి జాయింట్ సెక్రటరీ స్థాయి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. విమాన ప్రమాదానికి మూల కారణాన్ని నిర్ధారించండం జరుగుతుంది. ఇంజన్ వైఫల్యమా, మానవ తప్పిదమా, వాతావరణ పరిస్థితులు, నియంత్రణ సమ్మతులు సరిగా లేకపోవడమా ఇతర కారణాలతో వల్ల విమానం కూలిపోయిందా అనే అంశాలపై కమిటి విచారణ జరుపుతుంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలను నివారించడానికి అవసరమైన సిఫారసులు చేస్తుంది. విమాన ప్రమాదాలను నివారించడానికి ఉత్తమ అంతర్జాతీయ పద్ధతులను పరిశీలించి సిఫార్సులు చేస్తుంది. విమాన ప్రమాద సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర ప్రతిస్పందనను అంచనా వేయడం, సహాయ చర్యలు, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయానికి సంబంధించి ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలను కమిటీ పరిశీలిస్తుంది. దేశంలో గతంలో జరిగిన విమాన ప్రమాదాల రికార్డులను పరిశీలిస్తుంది. ప్రమాదానంతర చర్యలు ఏవిధంగా ఉండాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్ని ఏజెన్సీలు, సంస్థల పాత్రలను కమిటి తెలియజేస్తుంది. విమాన ప్రమాదాలను నివారించడానికి, ప్రమాదానంతర పరిస్థితిని నిర్వహించడానికి అవసరమైన విధాన మార్పులు, కార్యాచరణలను కమిటీ సూచిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..