
‘కాఫీ తాగితే దీర్ఘాయుష్షు.. సర్వే చెప్పిందిదే’ అంటూ పేపర్‌లో ఓ వార్త కనిపిస్తుంది. దానిపై సొసైటీలో ఓ చర్చ జరుగుతుంది. ఆ తరువాత ఓ ప్రముఖ కంపెనీ కాఫీ బ్రాండ్‌ను రిలీజ్ చేస్తుంది. ఇదంతా ఓ స్ట్రాటజీ. ఏదైనా బడా కంపెనీ తన ప్రాడక్ట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చే ముందు.. ఒక ఎన్విరాన్‌మెంట్ క్రియేట్ చేస్తుంది. అలా తన ప్రాడక్ట్‌కు బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకుంటుంది. ఇదే స్ట్రాటజీని రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న హీరోలు కూడా అప్లై చేశారు. ప్రస్తుత సమాజానికి తమ అవసరం ఏంటో ఆ సినిమాలతో చెప్పారు. ప్రభుత్వ పోకడలు ఎలా ఉన్నాయో, వాటికి పరిష్కారం ఏంటో చెబుతూ సినిమాల్లో చెప్పి రిలీజ్ చేశారు. సినిమాతో తాము కోరుకున్న వాతావరణం క్రియేట్ చేశాక.. అప్పుడు రాజకీయ అరంగేట్రం చేశారు. ఇప్పుడు విజయ్ కూడా అదే చేయబోతున్నారు. ‘మధురైయై మీట్ట సుందరపాండియన్’.. ఇది తమిళుల ఆరాధ్య నటుడు ఎంజీఆర్ నటించిన చివరి చిత్రం. ఈ సినిమా తరువాతే రాజకీయాల్లోకి వెళ్లారు. ఇక ఆ తరువాత సినిమాలే చేయలేదు. బట్.. పొలిటికల్ ఎంట్రీకి ముందు.. తన ఉద్దేశం ఏంటో ఆ సినిమాలో చెప్పేశారు. క్రూరమైన రాజుల పరిపాలనలో ఉన్న మధురై రాజ్యానికి విముక్తి కల్పిస్తాడు ఆ సినిమాలో. ప్రజలకు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కల్పిస్తాడు. ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే సబ్జెక్ట్ ఉంటుంది ఆ సినిమాలో. అంటే.. ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చే నాటికి తమిళనాట ఎలాంటి పరిస్థితి ఉందనేది పరోక్షంగా...