ఆప్ఘనిస్థాన్‌ను దువ్వుతూ బీజింగ్‌లో చర్చలు.. జిత్తులమారి కంట్రీల సరికొత్త డ్రామా..!

పీవోకేతో పాటు పాకిస్తాన్‌ను సైతం కంటికి రెప్పలా కాపాడుకోవాలి చైనా. పాకిస్తాన్ ముక్కలవుతుంటే.. డ్రాగన్‌ గుండె పగిలిపోతుంది. సపోజ్‌.. బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడినా, పీవోకేను భారత్‌ స్వాధీనం చేసుకున్నా.. చైనా నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్‌ కారిడార్ మొత్తం ఆగిపోతుంది.

ఆప్ఘనిస్థాన్‌ను దువ్వుతూ బీజింగ్‌లో చర్చలు.. జిత్తులమారి కంట్రీల సరికొత్త డ్రామా..!
Pakistan Occupied Kashmir

Updated on: May 22, 2025 | 9:55 PM

పీవోకేతో పాటు పాకిస్తాన్‌ను సైతం కంటికి రెప్పలా కాపాడుకోవాలి చైనా. పాకిస్తాన్ ముక్కలవుతుంటే.. డ్రాగన్‌ గుండె పగిలిపోతుంది. సపోజ్‌.. బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడినా, పీవోకేను భారత్‌ స్వాధీనం చేసుకున్నా.. చైనా నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్‌ కారిడార్ మొత్తం ఆగిపోతుంది. బలూచ్‌లోని బంగారు గనుల నుంచి బంగారాన్ని, బొగ్గు-గ్యాస్ నిక్షేపాలను దోచుకునే ఛాన్స్‌ రాదు. అన్నిటికీ మించి.. గ్వాదర్ పోర్ట్‌ను చైనా వదిలేసుకోవాల్సి ఉంటుంది. సో, పాకిస్తాన్‌ చల్లగా ఉండడమే చైనాకు కావాల్సింది. ఈ సీపెక్‌ ప్రాజెక్టుకు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి కూడా ప్రమాదం ఏర్పడింది. అందుకే, ఉన్నట్టుండి తాలిబన్‌ లీడర్లను చైనాకు పిలిపించుకుని, మాట్లాడింది చైనా. ఇంతకీ.. ఏంటీ సీపెక్‌.. ఈ కథనంలో తెలుసుకోండి.. ‘ఆల్‌ఫ్రెడ్‌ థయర్‌’ అని ఓ చరిత్రకారుడున్నారు. ఆయనో గొప్ప మాట చెప్పారు. ఎవరైతే హిందూ మహాసముద్రంపై పట్టు సాధిస్తారో.. వాళ్ల చేతికి ఆసియా ఖండం మొత్తం చిక్కుతుంది అని. అక్షరాలా నిజం ఆ మాట. పాకిస్తాన్‌లో లక్షల కోట్ల రూపాయలతో చైనా ఓ కారిడార్‌ను నిర్మిస్తున్నా, ఆఫ్ఘనిస్తాన్‌ను దువ్వుతున్నా, శ్రీలంక, బంగ్లాదేశ్‌కు విచ్చలవిడిగా అప్పులిస్తున్నా.. వీటన్నింటికీ కారణం ఇదిగో ఈ హిందూ మహాసముద్రంపై పట్టు కోసమే. ఈ వ్యూహం వెనకున్న అసలు నిజాలేంటో చూద్దాం. హిందూ మహాసముద్రం పరిధిలో మూడు ఖండాలు, మొత్తం 28 దేశాలు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 35 శాతం ఇక్కడే ఉంది. అంతేకాదు.. ఆసియా పసిఫిక్‌ రీజియన్‌ నుంచి మిడిల్‌ ఈస్ట్‌ మీదుగా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి