లడాఖ్ సరిహద్దుల్లో చైనా ‘బూచి’.. శరవేగంగా కాంక్రీట్ కట్టడాల నిర్మాణం.. రాహుల్ గాంధీ ఆందోళన నిజమేనా ?

| Edited By: Phani CH

Jul 15, 2021 | 7:49 PM

లడాఖ్ లో నియంత్రణ రేఖ పొడవునా చైనా శాశ్వత నిర్మాణాలను చేపడుతోంది. ఉత్తరసిక్కిం లోని 'నకూ లా', అరుణాచల్ ప్రదేశ్ బొర్దర్లలో ఆ దేశం పటిష్టమైన కట్టడాలను నిర్మిస్తున్నట్టు ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

లడాఖ్ సరిహద్దుల్లో చైనా బూచి.. శరవేగంగా కాంక్రీట్ కట్టడాల నిర్మాణం.. రాహుల్ గాంధీ ఆందోళన నిజమేనా ?
Eastern Ladakh
Follow us on

లడాఖ్ లో నియంత్రణ రేఖ పొడవునా చైనా శాశ్వత నిర్మాణాలను చేపడుతోంది. ఉత్తరసిక్కిం లోని ‘నకూ లా’, అరుణాచల్ ప్రదేశ్ బొర్దర్లలో ఆ దేశం పటిష్టమైన కట్టడాలను నిర్మిస్తున్నట్టు ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. వీటివల్ల చైనా బలగాలు తక్కువ సమయంలోనే భారత భూభాగాలను చేరుకోగలుగుతాయి. సరిహద్దులకు సమీప ప్రాంతాల్లో వివిధ చోట్ల కొత్త మిలిటరీ క్యాంపులను భారత ఏజెన్సీలు గమనించినట్టు ఈ వర్గాలు వెల్లడించాయి. ఈ విధమైన ఓ క్యాంపు నార్త్ సిక్కింకి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే ఉన్నట్టు ఇవి పేర్కొన్నాయి. తూర్పు లడాఖ్ దగ్గరి ప్రాంతాల్లో భారత భూభాగాలకు అతి సమీపంలో పలు బిల్డింగులు నిర్మిస్తున్నారని, దీనివల్ల ఆ దేశ సైనికులు ఇక్కడ శాశ్వతంగా తిష్ట వేసినా ఆశ్చర్యం లేదని ఈ వర్గాలు అభిప్రాయపడ్డాయి. పైగా కొన్నేళ్లుగా వారు తమ వైపు నుంచి రోడ్డు మార్గాన్ని కూడా పటిష్టం చేసుకుంటున్నారట. మరి ఇంత జరుగుతున్నా ఇప్పటికీ దీనిపై భారత సైన్యం నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ నిర్దిష్టమైన సమాచారం లేదు.

ప్రస్తుతం వాతావరణం అతి శీతలంగా ఉన్న కారణంగా ”ఇబ్బందులు ఎదుర్కొంటున్న” చైనా సైనికులు ఈ కొత్త కట్టడాల వల్ల వీటిలో ”సురక్షితంగా’ ఉండగలుగుతారు. తమకు ఆదేశాలు అందిన తక్షణమే ముందుకు కదులుతారు. పైగా ఈ కట్టడాల చుట్టూ ఆధునిక రీతిలో పటిష్టమైన సెక్యూరిటీ కూడా ఉన్నట్టు తెలియవచ్చింది. భారత ఏజెన్సీలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇదంతా చూస్తే సరిహద్దుల్లో చైనా వల్ల తలెత్తే పరిస్థితిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెలిబుచ్చిన ఆందోళన నిజమేనంటున్నారు. చైనా చర్యలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేకపోతోందని ఆయన పదేపదే ప్రశిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. చైనా గుట్టుచప్పుడు కాకుండా ఇంత చేస్తున్నా.. మరి భారత ఇంటెలిజెన్స్ సంస్థలు ఎందుకు పసిగట్టడం లేదన్నది ప్రశ్న.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Hero Bike: కేవలం నెలకు రూ.1794 చెల్లించి హీరో బైక్‌ను సొంతం చేసుకోవచ్చు.. 63 కిలోమీటర్ల మైలేజీ

Viral Video: స్టేజ్‌పై నిద్రపోతున్న వధూవరులు.. మరి బంధువులు ఏంచేశారో తెలుసా..?