Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‎లో 11 ప్రాంతాల పేర్లను మార్చిన చైనా..భారత్ ఏమందంటే

చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఎప్పుడెప్పుడు అరుణాచల్ ప్రదేశ్ భూభాగాన్ని ఆక్రమించుకుందామా అని ప్రయత్నాలు చేస్తూనే ఉంటోంది. ఇప్పడు తాజాగా మళ్లీ కవ్వింపు చర్యలు పాల్పడుతోంది.

Arunachal Pradesh:  అరుణాచల్ ప్రదేశ్‎లో 11 ప్రాంతాల పేర్లను మార్చిన చైనా..భారత్ ఏమందంటే
India China Border

Updated on: Apr 04, 2023 | 8:29 PM

చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఎప్పుడెప్పుడు అరుణాచల్ ప్రదేశ్ భూభాగాన్ని ఆక్రమించుకుందామా అని ప్రయత్నాలు చేస్తూనే ఉంటోంది. ఇప్పడు తాజాగా మళ్లీ కవ్వింపు చర్యలు పాల్పడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ ను టిబెట్ లోని దక్షణ భాగమని చెబుతున్న చైనా..దాన్ని జాంగ్ నామ్ గా పేర్కొంటు అక్కడు ఉన్న 11 ప్రాంతలా పేర్లు మార్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వశాఖ, చైనీస్, టిబెటన్ పిన్యిన్ అక్షరాలతో ఉన్న పేర్లను విడుదల చేసింది. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. అయితే చైనా తమ పేర్లను అరణాచల్ ప్రదేశ్ లో పలు ప్రాంతాలకు పెట్టడం మొదటిసారేం కాదు. 2017లో లో కూడా ఆరు ప్రాంతాలకు కొత్తగా పేర్లు పెట్టింది.

మళ్లీ 2021లో 15 ప్రాంతాలకు కూడా కొత్తపేర్లు పెట్టింది. ఇప్పుడు తాజాగా మరో 11 పేర్లను మార్చబోతున్నట్లు తెలిపింది. అయితే దీనిపై స్పందించిన భారత్ చైనా చర్యలను వ్యతిరేకించింది. ఆ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఓ ప్రకటన విడుదల చేశారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లోనే అంతర్భాగంగా కొనసాగుతుందని తెలిపారు. చైనా కల్పిత పేర్లు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాస్తవాలు మార్చలేరని స్పష్టం చేశారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..