CEC: సీఈసీ సాహసం..పోలింగ్ బూత్ కు వెళ్లేందుకు 18కిలోమీటర్ల ట్రెక్కింగ్..

సీఈసీ రాజీవ్ కుమార్ 18 కిలోమీటర్ల మేర కాలినడకన పాదయాత్ర చేసి మారుమూల ప్రాంతమైన చమోలీకి చేరుకున్నారు. ఒక అధికారి ఇంత సాహసం చేయడం ఇదే మొదటిసారి.

CEC: సీఈసీ సాహసం..పోలింగ్ బూత్ కు వెళ్లేందుకు 18కిలోమీటర్ల ట్రెక్కింగ్..
Cec
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 05, 2022 | 2:06 PM

దాదాపు 15 రోజుల క్రితం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ కుమార్ అధికారులకు మార్గదర్శకంగా వ్యవహరించారు. శుక్రవారం సీఈసీ రాజీవ్ కుమార్ 18 కిలోమీటర్ల మేర కాలినడకన పాదయాత్ర చేసి మారుమూల ప్రాంతమైన చమోలీకి చేరుకున్నారు. ఒక అధికారి ఇంత సాహసం చేయడం ఇదే మొదటిసారి. అందుకు గానూ అక్కడి దుమాక్, కిమానా గ్రామాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ప్రజలు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఉత్తరాఖండ్‌లోని రిమోట్ పోలింగ్ బూత్ అయిన డుమాక్‌ను పరిశీలించడం CEC పర్యటన ముఖ్య ఉద్దేశ్యం.

జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాంఖండ్ ప్రాంతాల్లోని కొన్ని బూత్ లకు చేరుకోవడం ఎంతో కష్టమైన పనిగా సీఈసీ రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. ‘‘ఈ పోలింగ్ స్టేషన్ ఉత్తరాఖండ్ లోని దుమక్ గ్రామంలో ఉంది. మారుమూలనున్న పోలింగ్ బూతులకు వెళ్లే దిశగా పోలింగ్ సిబ్బందిలో చైతన్యం తీసుకురావాలన్నది నా యోచన’’అని రాజ్ కుమార్ చెప్పారు. రాజీవ్ కుమార్ కు సాహసోపేత నిర్ణయాలు కొత్త కాదు. లీవ్ ట్రావెల్ కన్సెషన్ లో సెలవులపై ఎక్కువ రోజులు వెళ్లకుండా చూడాలని గత నెల మొదట్లో ఆదేశించారు. ఈ సందర్భంగా రాజీవ్‌ బూత్‌లోని సమస్యలు, సవాళ్లను పరిశీలించారు. కనీస వసతులు కూడా లేని ఈ ప్రాంత ప్రజల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ పర్యటన ఆశలు చిగురింపజేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ పర్యటనలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు సౌజన్య, ఉత్తరాఖండ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.