అడవిలో అన్నలపై కరోనా పంజా.. కోవిడ్‌తో 10 మంది మావోయిస్టులు మృతి..100 మంది వరకు పాజిటివ్‌.. పోలీసుల కీలక ప్రకటన

|

May 12, 2021 | 6:13 AM

Chhattisgarh Maoist: కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని బలి తీసుకుంటుండగా, తాజాగా దండకారణ్యంలో కరోనా..

అడవిలో అన్నలపై కరోనా పంజా.. కోవిడ్‌తో 10 మంది మావోయిస్టులు మృతి..100 మంది వరకు పాజిటివ్‌.. పోలీసుల కీలక ప్రకటన
Maoists
Follow us on

Chhattisgarh Maoist: కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని బలి తీసుకుంటుండగా, తాజాగా దండకారణ్యంలో కరోనా హడలెత్తిస్తోంది. మావోయిస్టులపై కరోనా పంజా విసురుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా దక్షిణి బస్తర్‌ అడవుల్లో కరోనాతో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ వెల్లడించారు. మరో 100 మంది వరకు కరోనా బారిన పడినట్లు తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు. అయితే కరోనా సోకడం, కలుషిత ఆహారం తినడంతో మావోయిస్టుల మృతి చెందినట్లు తెలుస్తోంది. కరోనాతో చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే కుంట, డోర్నపాల్‌ ప్రాంతాల్లో మావోయిస్టులు కరోనా వ్యాక్సిన్‌లతో పాటు దానికి సంబంధించిన ఔషధాలను తొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు గట్టి నిఘా పెంచాయి. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎప్పటికప్పుడు వారి ఆచూకీ కోసం అడవుల్లో జల్లెడ పడుతున్నారు. అయితే కరోనా సోకిన వాళ్లలో మహిళా మావోయిస్టు నేత సుజాతతో పాటు జయలాల్‌, దినేష్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా సోకిన మావోయిస్టులకు ఉచితంగా వైద్య అందిస్తామని పోలీసులు వెల్లడించారు. సుజాతపై 20 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా సమాచారం. కరోనా సోకిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ పోలీసులు పిలుపునిచ్చారు. అయితే కొరియర్లతో మావోయిస్టులకు కరోనా సోకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మైదానం ప్రాంతాలకు వచ్చిన మావోయిస్టు నేతలతో దళాల్లో కరోనా సోకినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో కరోనా వైరస్‌ మావోయిస్టులకు దడ పుట్టిస్తోంది. కాగా, కరోనా సోకిన వారిలో మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు నేతలు ఉన్నట్లు సమాచారం.

కాగా, ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు జరిపిన దాడిలో 20 మందికిపైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకున్న మావోయిస్టులు.. తరచూ బీభత్సం సృష్టిస్తూనే ఉన్నారు. దీంతో భద్రతా బలగాలు కూడా ప్రతినిత్యం వారి కోసం గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు కూడా హతమయ్యారు. ఆ రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో జరిగే వంతెన, చెక్‌ డ్యామ్‌, రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారు. అంతేకాదు వాహనాలను సైతం తగులబెడుతున్నారు. అలాగే ఇటీవల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా సంచరిస్తున్నారు. గత కొన్ని నెలలుగా కనిపించని మావోయిస్టులు.. ఇటీవల నుంచి వారి కదలికలు ఎక్కువైపోవడంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. వారిపై ప్రత్యేక నిఘా పెంచి అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్న కరోనా.. రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు.. కొత్తగా ఎన్ని కేసులంటే..!

K R Gouri: కేరళ తొలి రెవెన్యూ మంత్రి కేఆర్‌ గౌరీ అమ్మ (102) కన్నుమూత..11 సార్లు అసెంబ్లీకి ఎన్నిక