Chhattisgarh Encounter: శత్రువులతో మరింత పోరాటం కొనసాగిస్తాం.. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ స్ట్రాంగ్ రియాక్షన్..

|

Apr 04, 2021 | 12:07 PM

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఎన్‌కౌంటర్‌ భారీ స్థాయిలో జవాన్లు..

Chhattisgarh Encounter: శత్రువులతో మరింత పోరాటం కొనసాగిస్తాం.. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ స్ట్రాంగ్ రియాక్షన్..
Amith Shah
Follow us on

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఎన్‌కౌంటర్‌ భారీ స్థాయిలో జవాన్లు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మావోలతో పోరులో అసువులు బాసిన భద్రతా సిబ్బందికి అమిత్ షా నివాళులర్పించారు. మావోయిస్టులతో జరిగిన పోరాటంలో అమరులైన భద్రతా సిబ్బంది ధైర్య సాహసాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. వీరి పరాక్రమాన్ని దేశం ఎన్నటికీ మరువబోదని అన్నారు. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మావోయిసులతో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించిన అమిత్ షా.. శాంతి, అభివృద్ధికి శుత్రువులుగా మారుతున్న వారిని ఉక్కు పాదంతో అణచివేస్తామని తేల్చి చెప్పారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని అమిత్ షా ఆకాంక్షించారు.

ఇదిలాఉంటే.. మావోయిస్టులు, భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్‌కు ఫోన్ చేశారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి వివరాలపై ఆరా తీశారు. మావోయిస్టుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితిని సమీక్షించాలని అమిత్ షా కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్) డైరెక్టర్ జనరల్‌‌ కుల్‌దీప్ సింగ్‌ను ఆదేశించారు. వెంటనే కుల్‌దీప్ సింగ్ ఛత్తీస్‌గఢ్ చేరుకుని, భద్రతా దళాల కార్యకలాపాలను సమీక్షించారు. ఆ రాష్ట్ర డీజీపీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తదుపరి కార్యాచరణపై చర్చించారు.

ఇదిలాఉండగా, ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన జవాన్ల సంఖ్య 14కి చేరింది. బీజాపూర్ జిల్లాలో శనివారం నాడు జవాన్లపై మావోయిస్టులు మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో శనివారం నాడు ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఇవాళ మరో తొమ్మిది మంది జవాన్ల మృతదేహాలను గుర్తించారు. ఇక ఎదురు కాల్పుల్లో 30 మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఎన్‌కౌంటర్ తరువాత 24 మంది జవాన్ల ఆచూకీ కనిపించలేదు. అదృశ్యమైన జవాన్ల ఆచూకీ కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. సుక్మా, దంతేవాడ, బీజాపూర్, నారాయణ‌పూర్ జిల్లాల అడవుల్లో భారీస్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Also read:

Coronavirus: తెలంగాణను భయపెడుతున్న కరోనా… గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఎన్ని కేసులంటే..

Corona Wave in Tollywood: టాలీవుడ్ లో కరోనా కల్లోలం.. కోవిడ్ బారిన పడిన అల్లు అరవింద్.. త్రివిక్రమ్ కూడా కరోనా అంటూ టాక్..!