ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే మనోజ్ సింగ్ మాండవి ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. మనోజ్ సింగ్ మాండవి (58) ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. మాండవి తన స్వగ్రామమైన నాథియా సవాగాన్‌లో శనివారం రాత్రి ఛాతీలో నొప్పితోపాటు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన చరమలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కొసం కుటుంబసభ్యులు ధామ్‌తరి పట్టణంలోని ఆసుపత్రికి తరలించారని.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని రాష్ట్ర కాంగ్రెస్ కమ్యూనికేషన్ వింగ్ హెడ్ సుశీల్ ఆనంద్ శుక్లా తెలిపారు. కంకేర్ జిల్లాలోని భానుప్రతాప్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాండవి శనివారం రాత్రి జిల్లాలోని చరమా ప్రాంతంలోని తన స్వగ్రామమైన నాథియా నవాగావ్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు.
గిరిజన నేత అయిన మనోజ్ సింగ్ మాండవి భానుప్రతాప్‌పూర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2000- 2003 వరకు అజిత్‌జోగి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. బస్తర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు.
కాగా.. మనోజ్ మాండవి మృతి పట్ల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం తెలియజేశారు.
Chhattisgarh CM Bhupesh Baghel condoles the sudden demise of three-time Congress MLA and Deputy Speaker Manoj Singh Mandavi (in pic); calls it an “irreparable loss.”
The last rites of Mandavi will be performed in Nathiya Nawagaon in Kanker.
(Pic: Manoj Singh Mandavi’s FB page) pic.twitter.com/eFkQ8KPN6c
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 16, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..