Chakka Jam: దేశవ్యాప్తంగా ప్రారంభమైన ‘చక్కా జామ్’.. పలుచోట్ల కొనసాగుతున్న రైతుల ఆందోళనలు..

|

Feb 06, 2021 | 12:46 PM

రైతుల చ‌క్కా జామ్‌ ఆందోళన దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఢిల్లీ శివార్లలోని సింఘు, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో తోపాటు దేశంలోని..

Chakka Jam: దేశవ్యాప్తంగా ప్రారంభమైన ‘చక్కా జామ్’.. పలుచోట్ల కొనసాగుతున్న రైతుల ఆందోళనలు..
Follow us on

Farmers protest – Chakka Jam: రైతుల చ‌క్కా జామ్‌ ఆందోళన దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఢిల్లీ శివార్లలోని సింఘు, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో తోపాటు దేశంలోని పలుచోట్ల రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ ఆందోళన 3 గంటల వరకు కొనసాగనుంది. చక్కా జామ్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లను సైతం మూసివేసి డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.

పలు రాష్ట్రాల్లో చక్కా జామ్ ఆందోళనలు ప్రారంభమయ్యాయి.
ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, ఘాజీపూర్, టిక్రీ తదితర ప్రాంతాల్లో కూడా చక్కా జామ్ నిర్వహిస్తున్నారు.
రాజస్థాన్, హర్యానా సరిహద్దుల్లోని షాజహాన్‌పూర్‌లో రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తున్నారు.
పంజాబ్‌లో కూడా ఆందోళన ప్రారంభమైంది. రైతులు అమృత్‌సర్, మొహలీలో రహదారులపై ఆందోళనకు దిగారు.
కర్ణాటకలోని బెంగళూరు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చక్కా జామ్‌కు మద్దతుగా ఆందోళన చేస్తున్న నిరసనకారులను యలహంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Also Read:

Chakka Jam: ‘చక్కా జామ్’ అలర్ట్… దేశ రాజధానిలో పలు మెట్రో స్టేషన్ల మూసివేత.. డ్రోన్లతో పర్యవేక్షణ

ఇండియాలో రైతుల ఆందోళన, ఐరాస మానవ హక్కుల సంఘం జోక్యం, సంయమనం మేలని సూచన