Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం

|

May 01, 2021 | 1:18 PM

Central Government: రాష్ట్రాలకు మూల ధన వ్యయం కింద రూ.15 వేల కోట్లు సమకూర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం కింద రూ.15వేల కోట్లు..

Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం
Follow us on

Central Government: రాష్ట్రాలకు మూల ధన వ్యయం కింద రూ.15 వేల కోట్లు సమకూర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం కింద రూ.15వేల కోట్లు అదనపు మొత్తాన్ని అందించనున్నట్లు ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ వ్యయ విభాగం ఇందుకు సంబంధించి రాష్ట్రాలకు ఆర్థిక సహాయం పేరుతో 2021-22 సంవత్సరానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం కింద వడ్డీ లేకుండా 50 సంవత్సరాల రుణం రూపంలో ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని తెలిపింది. దీని కోసం 2020-21 సంవత్సరానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. దీంతో రూ.11,830 కోట్లు రాష్ట్రాలకు విడుదల చేసింది.

గత ఏడాది కరోనా మహహ్మారి కారణంగా రాష్ట్ర స్థాయిలో మూలధన వ్యయానికి సహాయంగా నిలిచింది. ఈ పథకానికి వచ్చిన సానుకూల స్పందనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాల విజ్క్షప్తులను పరిగణలోకి తీసుకుని కేంద్రం ప్రభుత్వం ఈ పథకాన్ని 2020-21 సంవత్సరానికి కూడా కొనసాగించాలని నిర్ణయించింది. ప్రత్యేక సహాయ పథకం కింద మూడు విభాగాలు ఉన్నాయి. మొదటి విభాగ ఈశాన్య, కొండ ప్రాంత రాష్ట్రాలకు సంబంధించినది. అయితే ఈ విభాగానికి రూ.2,600 కోట్లు కేటాయించారు. రెండో విభాగంలోని రాష్ట్రాల కోసం రూ. 7,400 కోట్ల రూపాయలు కేటాయించారు.  ఈ మొత్తాన్ని 15వ ఆర్థిక సంఘం అవార్డు మేరకు కేంద్ర పన్నుల్లో వాటా దామాషా విధానంలో రాష్ట్రాలకు కేటాయిస్తారు. అయితే తాజాగా కేంద్ర సర్కార్‌ ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో రాష్ట్రాలకు ఎంతో మేలు జరగనుంది.

ఇక మూడో విభాగం కింద రాష్ట్రాలకు మానిటైజేషన్‌, మౌలిక సదుపాయల ఆస్తుల రీసైక్లింగ్‌, పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు ప్రోత్సాహకం అందజేస్తారు. ఈ విభాగం కింద ఈ స్కీమ్‌ రూ.5 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రాలు అసెట్‌ మానిటైజేషన్‌, లిస్టింగ్‌, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూర్చుకున్న దానిలో 33 శాతం నుంచి 100 శాతం వరకు మొత్తాన్ని 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణం పొందుతాయి.

ఇవీ కూడా చదవండి:

Reliance Foundation: పెద్ద మనసును చాటుకున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. వెయ్యి పడకలతో కోవిడ్‌ ఆస్పత్రి.. ఎక్కడంటే

Remdesivir Medicine: రెమిడెసివిర్‌ కొరతకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం