11th Instalment GST Released: 11వ విడత 6వేల కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం ప్రభుత్వం

11th Instalment GST Released: కేంద్ర ప్రభుత్వం మరోసారి జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. 11వ విడతగా రూ.6వేల కోట్లను రాష్ట్రాలకు విడుదల చేసినట్లు కేంద్ర...

11th Instalment GST Released: 11వ విడత 6వేల కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం ప్రభుత్వం
వ్యాపారాలకు హెచ్‌ఎస్‌ఎన్ కోడ్ తప్పనిసరి: గూడ్స్ & సర్వీసెస్ టాక్స్ (GST) , రూ .50 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వ్యాపారాల ద్వారా ఇ-ఇన్‌వాయిస్ ఉత్పత్తి తప్పనిసరి.

Updated on: Jan 11, 2021 | 8:03 PM

11th Instalment GST Released: కేంద్ర ప్రభుత్వం మరోసారి జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. 11వ విడతగా రూ.6వేల కోట్లను రాష్ట్రాలకు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. తాజాగా 23 రాష్ట్రాలకు రూ.5,516.60 కోట్లు విడుదల చేయగా, కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌, పుదుచ్చేరిలకు రూ.483.40 కోట్లు అందజేసింది. మిగతా సిక్కిం, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో జీఎస్టీ అమలు కారణంగా ఆదాయాల్లో అంతరం లేదని తెలిపింది.

ఇప్పటి వరకు తాము అంచనా వేసినట్లు జీఎస్టీ పరిహారం కొరతలో దాదాపు 60,066.36 కోట్లు రాష్ట్రాలకు, రూ.5933.64 కోట్లు మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. మొత్తం రూ.66 వేల కోట్లు విడుదల చేయగా, వాటిలో ఏపీకి రూ.1559.07 కోట్లు, తెలంగాణకు రూ.1077.30 కోట్లు దక్కాయి. కాగా, జీఎస్టీ అమలు వల్ల ఏర్పడిన రెవెన్యూ లోటును రూ.1.10 లక్షల కోట్లుగా అంచనా వేసింది. అక్టోబర్‌ 23 నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తోంది.

Farmers Protest: నూతన వ్యవసాయ చట్టాలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు