Yoga Diwas 2023: మీడియా సంస్థలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ అవార్డులు.. ప్రకటించిన మంత్రి అనురాగ్ ఠాకూర్..
Yoga Diwas 2023: అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 మీడియా గౌరవార్థం కోసం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం దరఖాస్తులను ఆహ్వానించింది. మూడు విభాగాల్లో ఈ అవార్డులను అందజేయనున్నారు. మొత్తం 33 అవార్డులను ఇవ్వనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ అవార్డులతో సత్కరించనున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

Yoga Diwas 2023: అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 మీడియా గౌరవార్థం కోసం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం దరఖాస్తులను ఆహ్వానించింది. మూడు విభాగాల్లో ఈ అవార్డులను అందజేయనున్నారు. మొత్తం 33 అవార్డులను ఇవ్వనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ అవార్డులతో సత్కరించనున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.ప్రింట్, టెలివిజన్, రేడియో కింద 22 భారతీయ భాషలు, 11 అవార్డులు ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
దేశ సరిహద్దులు, సంస్కృతులకు అతీతం యోగా..
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం జూన్ 21 న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఒక సామూహిక ఉద్యమానికి పురికొల్పారని, యోగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ఆకర్షించిందని ఆయన తెలిపారు. ఇది సరిహద్దులు, సంస్కృతులను అధిగమించింది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం దాని సమగ్ర విధానం గణనీయమైన ఆసక్తిని సృష్టించింది. యోగాను ప్రపంచవ్యాప్తం చేయడంలో మీడియా కీలకపాత్ర పోషించిందంటూ అభినందించారు. కాగా, ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం మీడియా సమ్మాన్ రెండవ ఎడిషన్‌ను నిర్వహించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
యోగాను ప్రచారం చేయడంలో మీడియా పాత్ర కీలకం..
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. భారతదేశంతోపాటు విదేశాలలోనూ యోగా ప్రచారంలో మీడియా కీలక పాత్ర పోషించింది. అందుకుగాను ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. యోగాను ప్రచారం చేయడంలో మీడియా ఎంతో ముఖ్యమైనదని తెలిపారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..