వీరు నేరేడు పండ్లు అస్సలే తినకూడదు.. ఒక వేళ తిన్నారో..
samatha
22 march 2025
Credit: Instagram
సీజనల్ ఫ్రూట్స్‌లో నేరేడు పండ్లు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక వేసవి ముగిసే సమయంలో ఇవి చాలా దొరుకుతాయి.
అంతే కాకుండా నేరేడు పండ్లలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు నిపుణులు.
నేరేడు పండులో యాంటీ ఆక్సిడేంట్స్, విటమిన్స్, క్యాన్సర్, కాలేయ సంబంధ వ్యాధులను నయం చేసే అనేక ఔషధ గుణాలు ఉంటాయి.
అంతేకాకుండా ఐరన్, విటమిన్ సీ, విటమిన్ బీ, వంటి అనేక పోషకాలు నేరేడు పండులో ఉంటాయంట. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొందరు వీటిని అస్సలే తినకూడదంట.
కాగా, అసలు నేరేడు పండ్లను ఎవరు తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం.. డయాబెటిస్ ఉన్న వారు నేరేడు పండ్లకు చాలా దూరంగా ఉండాలంట. దీని వలన షుగర్ లెవల్స్ తగ్గే ఛాన్స్ ఉంటుదంట.
అదే విధంగా ఎవరైతే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారో, అలాంటి వారు అస్సలే అతిగా నేరేడు పండ్లు తీసుకోకూడదంట.దీని వలన సమస్య మరితం తీవ్రతరం అవుతుందంట.
కొంత మంది ప్రయాణంలో వాంతులు చేసుకోవడం చేస్తుంటారు. అయితే అలాంటి వారు జర్నీ చేసే సమయంలో అస్సేల నేరేడు పండ్లు తీసుకోకూడదంటున్నారు వైద్యులు.
అదేవిధంగా నేరేడు పండ్లను అధికంగా తీసుకోవడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉన్నదంట. అందువలన చాలా వారకు వీటిని మితంగా తీసుకోవడమే మంచిదంట.