Kishan Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. నందు తెలుసు.. కానీ

|

Oct 28, 2022 | 1:04 PM

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అనేది టీఆర్ ఎస్ పార్టీ, తెలంగాణ సీఏం కేసీఆర్ సృష్టించిన..

Kishan Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. నందు తెలుసు.. కానీ
Kishan Reddy
Follow us on

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అనేది టీఆర్ ఎస్ పార్టీ, తెలంగాణ సీఏం కేసీఆర్ సృష్టించిన డ్రామా అని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు దొరికాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అసలు పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ గ్రేట్ మాస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ ఢిల్లీలో కాదు.. లండన్ లో కూడా పెట్టుకోవచ్చంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవ చేశారు. ఎమ్మెల్యే కొనుగోళ్ల వ్యవహారం పై న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలకు పార్టీలను టీఆర్ఎస్ లో కలుపుకుంది ఎవరో ప్రజలు అందరికి తెలుసన్నారు. ఇతర పార్టీలో గెలిచిన వారిని డబ్బులు పెట్టి కొనే సంస్కృతిని తీసుకువచ్చింది కేసీఆర్ కాదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలోని ఆర్ట్స్ గ్యాలరీ భవన్ లో అక్బర్ సాహెబ్ ఆర్టిస్ట్ చిత్రాల ప్రదర్శన కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మోడీకి సంబంధించి దుబాయిలో ఉంటున్న ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారుడు అక్బర్ గీసిన 50కి పైగా చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు.

నరేంద్ర మోడి చిన్న నాటి నుంచి ప్రధాని పదవి వరకు చేపట్టిన కార్యక్రమాలు, దేశంలో తీసుకు వచ్చిన మార్పులను తెలియజెప్పేలా గీసిన చిత్రాలను ప్రదర్శనలో ఉంచినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణలపై కేంద్రమంత్రి స్పందిస్తూ.. ప్రభుత్వాన్ని కూల్చేసి, బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటుచేయాలని చూస్తుందనే ఓ కట్టుకధ అల్లే ప్రయత్నం చేశారని విమర్శించారు. అనేక పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు, మున్సిపల్ ఛైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీలతో సహా ఇతర ప్రజాప్రతినిధులను రాజీనామా చేయించకుండా తన పార్టీలో చేర్చుకుని పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిన ఏకైక సీఏం కేసీఆర్ మాత్రమేనని ఆరోపించారు.

ఇతర పార్టీల నుంచి తన పార్టీలో చేర్చుకుని నైతిక బాధ్యతగా రాజీనామా చేయించకుండా పార్టీలో కొనసాగించిన చరిత్ర కేసీఆర్ కే దక్కుతుందన్నారు. నలుగురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను ఇప్పటికిప్పుడే చేర్చుకుంటే తమకు వచ్చిన ప్రయోజనం ఏముంటుందన్నారు. తమ పార్టీలో చేరడానికి ఎవరైనా ప్రజాప్రతినిధులు ముందుకువస్తే ముందు వారి పదవులకు రాజీనామా చేసిన తర్వాత మాత్రమే పార్టీలో చేర్చుకుంటామన్నారు. ఇప్పటికైనా టీఆర్ ఎస్ అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. నందు అనే వ్యక్తి తనకు తెలుసని, కానీ తన అనుచరుడు మాత్రం కాదన్నారు. ప్రస్తుతం టీఆర్ ఎస్ పార్టీకి దగ్గరగా ఉన్నాడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..