Ayodhya: అయోధ్యలో అత్యాధునిక హంగులతో మరో సదుపాయం.. త్వరలో అందుబాటులోకి వస్తుందన్న కేంద్ర మంత్రి

|

Mar 09, 2021 | 8:58 PM

Ayodhya: అయోధ్యలో మరో సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పనులు కొనసాగుతున్న ఈ నిర్మాణం త్వరలో అందుబాటులోకి రానుంది...

Ayodhya: అయోధ్యలో అత్యాధునిక హంగులతో మరో సదుపాయం.. త్వరలో అందుబాటులోకి వస్తుందన్న కేంద్ర మంత్రి
Follow us on

Ayodhya: అయోధ్యలో మరో సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పనులు కొనసాగుతున్న ఈ నిర్మాణం త్వరలో అందుబాటులోకి రానుంది. అయోధ్యలో అత్యాధునిక విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోందని కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి మంగళవారం తెలిపారు. ఈ ఎయిర్‌పోర్టు కోసం రూ. 242 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే శ్రీరామున్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎంతో సదుపాయంగా ఉంటుందని ఆయన అన్నారు.

ఈ మేరకు హర్‌దీప్‌సింగ్‌ మంగళవారం ట్విట్‌ చేశారు. శ్రీరాముని జన్మ భూమి అయోధ్యకు పౌర విమానయనం అనుసంధానంపై శుభవార్త చెబుతున్నానని అన్నారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అయోధ్యలో అత్యాధునిక హంగులతో నిర్మాణం జరుగుతోందని, ఇందు కోసం రూ.242 కోట్లు మంజూరయ్యాయని అన్నారు. అలాగే ఇందు కోసం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

కాగా, ఇటీవల ఈ ఎయిర్‌ పోర్టుకు పేరు కూడా ఖరారు చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌. రాముడి పేరు వచ్చేలా ‘మర్యాద పురుషోత్తమ్‌ శ్రీరామ్‌ ఎయిర్‌పోర్ట్‌’ అని నామకరణం చేశారు. అలాగే బడ్జెట్‌లో ఎయిర్‌ పోర్ట్‌ డెవలప్‌మెంట్‌కు గానూ రూ. 101 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా దశల వారీగా దీనిని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. ఇక జవార్‌ విమానాశ్రయంలో ప్రస్తుతం రెండుగా ఉన్న ఎయిర్‌ స్ట్రిప్పులను ఆరుకు పెంచేందుకు నిర్ణయం తీసుకుంటూ రూ.2వేల కోట్లు యోగి ప్రభుత్వం కేటాయించింది. అలీగఢ్‌, మొరాదాబాద్‌, మీరట్‌ వంటి నగరాలకు త్వరలో విమాన సేవలు కల్పించబోతున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు.

అయితే తొలి దశ కార్యకలాపాల కోసం సుమారు 270 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా, విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు మరొక 558 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోందన్నారు.

ఇవి చదవండి :

Lockdown: పెరుగుతున్న కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా ఆలోచన.. షాపుల వద్ద బారులు తీరుతున్న జనాలు

Flipkart Smartphone Carnival: ప్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్లు.. 20 స్మార్ట్‌ ఫోన్‌లపై రూ. 10,000 వరకు డిస్కౌంట్‌