AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AFSPA: మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. సాయుధ దళాల చట్టం నుంచి ఆ జిల్లాలకు మినహాయింపు..

Armed Forces Special Powers Act: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం-AFSPA పరిధిని కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని 36 జిల్లాలను ఈ జాబితా

AFSPA: మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. సాయుధ దళాల చట్టం నుంచి ఆ జిల్లాలకు మినహాయింపు..
Amit Shah On Afspa
Shaik Madar Saheb
|

Updated on: Apr 01, 2022 | 6:20 AM

Share

Armed Forces Special Powers Act: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం-AFSPA పరిధిని కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని 36 జిల్లాలను ఈ జాబితా నుంచి తొలగించింది. అస్సాం, మణిపూర్‌, నాగాలాండ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం నుంచి మినహాయింపు లభించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah) ట్వీట్‌ చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసి శాంతిని నెలకొల్పేందుకు ప్రధాని మోదీ నేతృత్యంలో ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నామని తెలిపారు.

సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టంపై మొదటి నుంచీ వివాదాలే ఉన్నాయి. జమ్మూ కశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 1958 సెప్టెంబరు 11 నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు వారెంట్‌ లేకుండా అరెస్టు చేసేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది.. అయితే ఈ చట్టం దుర్వినియోగం అవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఎంతో మంది అన్యాయంగా బలైపోతున్నారని, ఈ చట్టాన్ని ఎత్తయాలని ఆందోళనలు మొదలయ్యాయి.. ఇరోమ్‌ షర్మిల అయితే ఏకంగా 20 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేశారు.

గత ఏడాది డిసెంబరు 4న నాగాలాండ్‌లో భద్రతా దళాలు కొందరు గ్రామస్థులను ఉగ్రవాదులుగా భావించి, వారిపై కాల్పులు జరపడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కాగా.. ఈ చట్టాన్ని ఉపసంహరించే అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని గత ఏడాది ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు క్రమంగా AFSPAను ఎత్తేయాలని నిర్ణయించారు.

Also Read:

Bihar CM: మద్యం సేవించేవారు భారతీయులే కాదు.. మహా పాపులు.. బీహార్ సీఎం నితిష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Kejriwal vs Kashmir Files: కేజ్రీవాల్‌ను బీజేపీ చంపాలనుకుంటోంది.. ఆప్ నేత సిసోడియా తీవ్ర ఆరోపణలు..